శక్తిమాన్ ప్రాజెక్టులో ఎలాంటి మార్పు లేదు.. డైరెక్టర్ క్లారిటీ
డైరెక్టర్ గా, నటుడిగా బాసిల్ జోసెఫ్ కు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. సౌత్ సినిమాల్లోని టాలెంటెడ్ డైరెక్టర్లలో బాసిల్ జోసెఫ్ కూడా ఒకడు.
By: Tupaki Desk | 22 Jun 2025 12:56 PM ISTడైరెక్టర్ గా, నటుడిగా బాసిల్ జోసెఫ్ కు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. సౌత్ సినిమాల్లోని టాలెంటెడ్ డైరెక్టర్లలో బాసిల్ జోసెఫ్ కూడా ఒకడు. ఇప్పటికే పలు మంచి సినిమాలు తీసి డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ ప్రస్తుతం శక్తిమాన్ అనే భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా రణ్‌వీర్ సింగ్ కన్ఫర్మ్ కూడా అయ్యారు.
అయితే ఈ సినిమాలో రణ వీర్ సింగ్ కు బదులు అల్లు అర్జున్ కనిపించనున్నాడని రీసెంట్ గా వార్తలొస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా బాసిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అతనికి శక్తిమాన్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. రణ్ వీర్ ప్లేస్ లోకి అల్లు అర్జున్ వచ్చారా అనే ప్రశ్న బాసిల్ ను అడగ్గా ఆయన దానిపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
శక్తిమాన్ ప్రాజెక్టులోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. శక్తిమాన్ ప్రాజెక్ట్ రణ్ వీర్ సింగ్ తోనే జరుగుతుందని, ఈ ప్రాజెక్టులో ఎలాంటి మార్పు లేదని బాసిల్ వెల్లడించాడు. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శక్తిమాన్ గా మారుతున్నారని వస్తున్న విషయంలో స్పష్టత వచ్చింది.
అయితే శక్తిమాన్ ప్రాజెక్టును అల్లు అర్జున్ చేయడం లేదని డైరెక్టర్ స్పష్టం చేసినప్పటికీ బాసిల్ తో కలిసి అల్లు అర్జున్ వర్క్ చేస్తాడా లేదా అనేది కాలమే డిసైడ్ చేయాలి. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్ తో చేయాల్సిన బన్నీ సినిమా క్యాన్సిల్ అవగానే, బన్నీ పీఆర్ టీమ్ బాసిల్ జోసెఫ్ తో సినిమా చేసే అవకాశాలున్నట్టు హింట్ ఇవ్వడంతో అందరూ ఆ ప్రాజెక్టు శక్తిమాన్ అనే అనుకున్నారు. కానీ ఇప్పుడు బాసిల్ క్లారిటీ ఇవ్వడంతో బన్నీ శక్తిమాన్ ప్రాజెక్టు చేయడం లేదని స్పష్టమైంది. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్, తన తర్వాతి సినిమాను అట్లీతో చేయనున్న సంగతి తెలిసిందే.
