Begin typing your search above and press return to search.

ఆ శక్తిమాన్ మళ్ళీ వస్తున్నాడు

ఇప్పుడు ఆ పాత్రని సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు. ఎప్పటి నుంచో దీనికి సంబందించిన ప్రణాళిక సిద్ధం అవుతోంది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:05 AM GMT
ఆ శక్తిమాన్ మళ్ళీ వస్తున్నాడు
X

90వ దశకంలో ఇండియా మొత్తం పాపులర్ అయిన సూపర్ హీరో క్యారెక్టర్ శక్తిమాన్. ఈ సిరీస్ చాలా పెద్ద హిట్ అయ్యింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇంటరెస్ట్ గా చూసేవారు. శక్తిమాన్ సీరియల్ ని చాలా ఇండియన్ భాషలలో అప్పుడు ప్రసారం చేసేవారు. మొదటి ఇండియన్ సూపర్ హీరో కామిక్ క్యారెక్టర్ గా శక్తిమాన్ ఇప్పటికి చెప్పబడుతుంది.

ఇప్పుడు ఆ పాత్రని సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు. ఎప్పటి నుంచో దీనికి సంబందించిన ప్రణాళిక సిద్ధం అవుతోంది. రీసెంట్ గా హనుమాన్ సినిమా వచ్చి ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో సూపర్ హీరో కథలకి మన ఇండియాలో కూడా మార్కెట్ స్కోప్ ఉందని డిసైడ్ అయ్యి శక్తిమాన్ క్యారెక్టర్ తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నారు.

సోనీ పిక్చర్స్ సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని సిరీస్ లు గా చేయబోతున్నారంట. ఇక శక్తిమాన్ పాత్ర కోసం రణవీర్ సింగ్ ఇప్పటికే సైన్ చేసినట్లు తెలుస్తోంది. శక్తిమాన్ రోల్ లో యాక్షన్ తో పాటు గా కామిక్ టచ్ కూడా ఉంటుంది. రెండు భిన్నమైన పాత్రలలో హీరో కనిపించాలి. అందుకే రణవీర్ సింగ్ కి ఆ క్యారెక్టర్ కోసం ఎంపిక చేసుకున్నట్లు బిటౌన్ టాక్. .

2025లో ఈ సినిమా నిర్మాణం స్టార్ట్ కానుందని సమాచారం. మలయాళంలో మిన్నర్ మురళీలో సూపర్ హీరో క్యారెక్టర్స్ తో సూపర్ హిట్ మూవీ చేసిన బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ని ప్రశాంత్ వర్మ స్టార్ట్ చేశారు. టైటిల్ రోల్ కోసం స్టార్ హీరోని వెతుకుతున్నాడు.

ఇప్పుడు శక్తిమాన్ కూడా వెండితెరపైకి వస్తే కచ్చితంగా వండర్స్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందనేది వేచి చూడాలి. జై హనుమాన్, శక్తిమాన్ హిట్ అయితే భవిష్యత్తులో మరిన్ని సూపర్ హీరో కథలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ కూడా ఇప్పటికే సూపర్ హీరో కథలతో సినిమాటిక్ యూనివర్స్ ని బిల్డ్ చేస్తున్నారు. వాటిలో ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని సూపర్ హీరోలని మరల తీసుకొని రానున్నాడు.