Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో భయంకర చేతబడి సినిమా!

ఇక ఇప్పుడు మరోసారి బాలీవుడ్ నుంచి అలాంటి సినిమానే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది

By:  Tupaki Desk   |   25 Jan 2024 7:44 AM GMT
బాలీవుడ్ లో భయంకర చేతబడి సినిమా!
X

హారర్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కి బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ వచ్చింది కాబట్టి అన్ని భాషల్లో ఈ ఇలాంటి జోనర్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. చేతబడి, దెయ్యాలు.. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ చాలా ప్రత్యేకంగా తెరకెక్కిస్తుంటారు. తమ మేకింగ్ తో థియేటర్లో ఆడియన్స్ కి భయంకరమైన హారర్ ఫీల్ ఇస్తుంటారు.

ఇక ఇప్పుడు మరోసారి బాలీవుడ్ నుంచి అలాంటి సినిమానే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ లో క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి సినిమాలను తెరకెక్కించిన వికాస్ బెహల్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక లీడ్ రోల్స్ లో నటిస్తున్న తాజా చిత్రం 'సైతాన్'. కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఆర్. మాధవన్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఇటీవలే సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈరోజు(గురువారం) సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా రిలీజ్ చేసిన ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. కంప్లీట్ బ్లాక్ మ్యాజిక్ ఆధారంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వెకేషన్ కోసం ఓ మారుమూల గ్రామానికి వెళ్ళిన ఓ ఫ్యామిలీ అపరిచిత వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది.

అతను ప్రయోగించిన చేతబడి నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడింది? అనేది ఈ సినిమా అసలు కథగా టీజర్ చూస్తే తెలుస్తోంది. ఆర్. మాధవన్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపించబోతున్నట్లు టీజర్ లో చూపించారు. జియో స్టూడియో సమర్పణలో అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, అభిషేక్ పాఠక్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 8న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఈ సినిమాతో పాటు అజయ్ దేవగన్ 'మైదాన్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో అజయ్ దేవగన్ అబ్దుల్ రహీం పాత్రలో కనిపించబోతున్నారు. అమిత్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రంజాన్ కానుకగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.