Begin typing your search above and press return to search.

తెలుగులో షారుక్ జోరు.. బిగ్గెస్ట్ రికార్డ్ పక్కా

ఈ స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో షారుక్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   3 Sep 2023 12:30 AM GMT
తెలుగులో షారుక్ జోరు.. బిగ్గెస్ట్ రికార్డ్ పక్కా
X

షారుఖ్ ఖాన్ హీరోగా అత్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కమర్షియల్ మూవీ జవాన్. ఈ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్స్ లోకి రాబోతోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే హిందీ, తమిళ్ భాషలలో అడ్వాన్స్ బుకింగ్స్ తో జవాన్ మూవీ మంచి స్పీడ్ మీద ఉంది.

హిందీ యాక్టర్స్ తో పాటు కోలీవుడ్ నుంచి విజయ్ సేతుపతి, నయనతార లాంటి స్టార్ క్యాస్టింగ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ జవాన్ మూవీకి వర్క్ చేస్తున్నారు. ఈ కారణంగా సినిమాకి తమిళనాడులో కూడా మంచి హైప్ ఉంది. ఇప్పటికే నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి 250 కోట్ల రిటర్న్స్ వచ్చేశాయి. థియేటర్స్ లోకి కూడా భారీ టార్గెట్ తోనే రిలీజ్ కాబోతోంది.

నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ లో ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ట్రైలర్ కూడా బాగా కనెక్ట్ కావడంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా జవాన్ మూవీ హిందీ వెర్షన్ కి నైజాం ఏరియాలో 50 శాతం ఆక్యుపెన్సీతో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. 70 లక్షల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరకు వచ్చాయి.

ఈ స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో షారుక్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హిందీ ప్రభావం ఉన్న నైజాంలో అయితే కచ్చితంగా జవాన్ భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుందని భావిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి తెలుగు ఆడియన్స్ కి బాగా రీచ్ అయినవాళ్లు కాబట్టి తెలుగు వెర్షన్ కి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఓవరాల్ గా షారుఖ్ ఖాన్ ఖాతాలో జవాన్ మరో వెయ్యి కోట్లు కొల్లగొట్టే ప్రాజెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే షారుఖ్ ఖాన్ ని ఇండియన్ బాద్ షా అని పిలుస్తున్నందుకు పేరుకి సార్ధకత లభించినట్లు అవుతుంది. మరి జవాన్ అంచనాలని ఏ మేరకు అందుకుంటుందో అనేది వేచి చూడాలి.