Begin typing your search above and press return to search.

షారుక్ ఖాన్-సందీప్ మ‌ధ్య మాట‌ల యుద్దం!

సినిమాలో పాత్ర‌ల‌న్నింటిని విమ‌ర్శించిన నోళ్లెన్నో. కాక‌పోతే 900 కోట్లు వ‌సూళ్లు తెచ్చిన సినిమా కావ‌డం తో విమ‌ర్శ‌ల‌న్నీ కొవొత్తిలా క‌రిగిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   8 Feb 2024 10:40 AM GMT
షారుక్ ఖాన్-సందీప్ మ‌ధ్య మాట‌ల యుద్దం!
X

షారుక్ ఖాన్ -సందీప్ రెండ్డి మ‌ధ్య అప్పుడే మాట‌ల యుద్దం మొద‌లైందా? ఆ విష‌యంలో ఎవ‌రికి వారు త‌గ్గ‌డం లేదా? ఎవ‌రికి వారే రైట్ అనుకుంటున్నార‌? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ ఈ వార్ ఎందుకు మొద‌లైంది? అందుకు కార‌ణాలు ఏంటి? అంటే ఆ పూర్తి వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన 'యానిమ‌ల్' ఎంత పెద్ద స‌క్స‌స్ అయిందో? అంత‌కు మించి పాత్ర‌ల ప‌రంగా అంతే నెగిటివిటీని తెచ్చి పెట్టిన సంగ‌తి తెలిసిందే.

సినిమాలో పాత్ర‌ల‌న్నింటిని విమ‌ర్శించిన నోళ్లెన్నో. కాక‌పోతే 900 కోట్లు వ‌సూళ్లు తెచ్చిన సినిమా కావ‌డం తో విమ‌ర్శ‌ల‌న్నీ కొవొత్తిలా క‌రిగిపోతున్నాయి. ఇటీవ‌లే షారుక్ ఖాన్ కూడా విల‌న్ పాత్ర‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 'ఆశాజన‌కంగా..సంతోషంగా ఉండే క‌థ‌ల్నే ఎంచుకుంటాను. నా సినిమాలో హీరో పాత్ర మంచి ప‌నులే చేస్తుంది. ఎంతో మందికి ఆద‌ర్శంగా ఉంటుంది. ఆ పాత్ర‌కి హీరో చేతిలో చావు దెబ్బ‌లు త‌ప్ప‌వు.

ఎందుకంటే ఎప్ప‌టికైనా చెడుపై మంచే గెలుస్తుంది' అన్నారు. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై సందీప్ రెడ్డి అంతే ధీటుగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. హీరో పేరు పెట్ట‌కుండా అత‌డిపై త‌న‌దైన శైలిలో స్పందిం చాడు సందీప్. 'కొంద‌రికి హీరో అంటే అర్ధం ఏంటో తెలియ‌డం లేదు. ఆద‌ర్శ‌వంత‌మైన పాత్ర‌లే చేయా లని..ఆలాచేస్తేనే హీరో అవుతార‌ని అనుకుంటున్నారు. నేను అలా అనుకోను' అంటూ సందీప్ వ్యాఖ్యా నిం చాడు. దీంతో ఈ వ్యాఖ్య‌లు షారుక్ ఖాన్ కి కౌంట‌ర్ గానే వేసిన‌ట్లు నెటి జ‌నులు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఈ మాట‌ల యుద్దానికి ముందే షారుక్ ఖాన్ తో ఓ సినిమా చేయాల‌ని ఉంద‌ని సందీప్ రెడ్డి ఓపెన్ అయిన సంగ‌తి తెలిసిందే. ఏ ద‌ర్శ‌కుడైనా షారుక్ తో క‌లిసి ప‌న‌చేయ‌డానికి ఎదురు చూస్తాడ‌ని..నేను కూడా అత‌ని కోసం ఎదురు చూస్తున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. భ‌విష్య‌త్ లో త‌ప్ప‌కుండా సినిమా చేస్తాన‌ని అన్నారు. అటుపై షారుక్ ఖాన్ సినిమాలో పాత్ర‌ల గురించి మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు. దీంతో సందీప్ రెడ్డి వంగా సీన్ లోకి రావాల్సి వ‌చ్చింది. ఇప్పుడ‌ది చినిగి చినిగి గాలి వాన‌లా మారుతోంది.