షారుక్-విజయ్ కాంబో.. రూ.1500కోట్లు టార్గెట్..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం 'జవాన్' రీసెంట్గా రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Sept 2023 4:28 PM ISTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం 'జవాన్' రీసెంట్గా రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ దూసుకెళ్తున్న ఈ చిత్రం.. దాదాపు రూ.1000కోట్లు మార్క్ అందుకునే దిశగా పోతోంది. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గెస్ట్ రోల్ట్ చేశారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు.
అదే సమయంలో రిలీజ్‌కు ముందు దర్శకుడు అట్లీ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో విజయ్-షారుక్ కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేయొచ్చని అన్నారు. అయితే తాజాగా మళ్లీ ఇప్పుడు ఈ కాంబో గురించి తెరపైకి వచ్చింది. ఈ సినిమా గురించి అట్లీ మరోసారి మాట్లాడినట్లు తెలుస్తోంది. జవాన్ సినిమాలో విజయ్ కెమియో రోల్‌ను తాను ఎందుకు స్కిప్ చేశారో చెప్పారట.
షారుక్ ఖాన్ - విజయ్ దళపతి కాంబోలో ఓ చిత్రాన్ని సిద్ధం చేసేలా వర్క్ చేస్తున్నట్లు అట్లీ చెప్పారని కథనాలు వచ్చాయి. అందుకే ఈ కామియో రోల్‌ను స్కిప్ చేశారట. వీరిద్దరి కాంబో చిత్రం దాదాపు రూ.1500కోట్ల వరకు వసూళ్లను సాధిస్తుందని ఆయన అన్నారట. చూడాలి మరి ఈ కాంబో ఎప్పటికీ సెట్ అవుతుందో.. సెట్స్‌పైకి ఎప్పటికీ వెళ్తుందో...
ఇకపోతే ప్రస్తుతం జవాన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న షారుక్.. త్వరలోనే తన తదుపరి చిత్రం డంకీ కోసం వర్క్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే అవకాశముంది. ఈ చిత్రంతోనూ మరో విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాలని షారుక్ ఆశిస్తున్నారు.
విజయ్ దళపతి త్వరలోనే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో లియో చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. త్రిష హీరోయిన్. అక్టోబర్ 19న సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
