Begin typing your search above and press return to search.

తొలి సినిమాలో తండ్రీ-కూతుళ్లు గురు శిష్యులు!

షారుక్ ఖాన్ వారుసురాలు సుహానాఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని ప్రేక్ష‌కాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు

By:  Tupaki Desk   |   21 April 2024 12:30 AM GMT
తొలి సినిమాలో తండ్రీ-కూతుళ్లు గురు శిష్యులు!
X

షారుక్ ఖాన్ వారుసురాలు సుహానాఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా? అని ప్రేక్ష‌కాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. `ది అర్చిస్` త‌ర్వాత ఎంట్రీ ఇచ్చినా హీరోయిన్ గా డెబ్యూ కోసం ఎదురుచూస్తోన్న స‌మ‌యమిది. తాజాగా ఆ ప్రాజెక్ట్ షురూ అయింది. `కింగ్` అనే సినిమాతో అమ్మ‌డు లాంచ్ అవుతుంది. సుజోయ్ ఘోష్ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుహానాఖాన్ కి తొలి సినిమా కావ‌డంతో బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించాల‌ని షారుక్ ఆదేశాలిచ్చారు.

ఈ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్ పోషిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ఓ ప్ర‌చారం సాగుతుంది. అయితే అది అతిధి పాత్ర కాద‌ని గురువు పాత్ర అని తాజాగా లీకైంది. కుమార్తెకి గురువు పాత్ర‌లో షార‌క్ న‌టించ‌నున్నారుట‌. ఈ క‌థ‌కి సంబంధించిన ప‌నుల‌న్నింటిని షారుక్ ద‌గ్గ‌రుండి చూస్తున్నారుట‌. ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌స‌రం మేర భారీ మార్పులు చేయిస్తు న్నారుట‌. ప్రతీ స‌న్నివేశం ప్ర‌త్యేకంగా ఉండ‌టం కోసం విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల‌ను రంగంలోకి దించుతున్నారుట‌. పేరుకు గురువు పాత్ర అయినా షారుక్ రోల్ సినిమాలోచాలా ప‌వ‌ర్ పుల్ గా ఉంటుంద‌ని..కింగ్ ఖాన్ ఇమేజ్ ని అంత‌కంత‌కు ఆ పాత్ర రెట్టింపు చేసేలా ఉంటుంద‌ని అంటున్నారు.

కుమార్తె హీరోయిన్ గా న‌టిస్తోన్న తొలి సినిమా కావ‌డంతోనే షారుక్ ఖాన్ ఆ ఛాన్స్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా ఇలాంటి పాత్ర‌లు షారుక్ ఖాన్ చేయ‌డు. అగ్ర హీరోల‌తోనే ఆయ‌న అంత ఈజీగా క‌లిసి న‌టించ‌డం అన్న‌ది జ‌రగ‌దు. త‌న‌కు బాగా క్లోజ్ అయితే త‌ప్ప సినిమా చేయ‌డు. కానీ కుమార్తె కోసం త‌న ఇమేజ్ ని ప‌క్క‌న‌బెట్టి రంగంలోకి దిగుతున్నాడు. ఇందులో హీరో ఎవ‌రు? ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది? రిలీజ్ ఎప్పుడు? అన్న సంగ‌తి అతి త్వ‌ర‌లోనే బ‌య‌టకు రానుంది.

ఇక షారుక్ ఖాన్ గ‌తేడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌ఠాన్..జ‌వాన్ తో వ‌రుస విజ‌యాల‌తో పుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్ర‌స్తుతం కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించిన ప‌నుల్లో ఉన్నాడు. ఆ వివ‌రాలు ఇదే ఏడాది బ‌య‌ట‌కొస్తాయి. ప్రాజెక్ట్ లు మాత్రం వ‌చ్చే ఏడాదిగానీ...ఇయ‌ర్ ఎండింగ్ లో గానీ ప‌ట్టాలెక్కిస్తారు.