Begin typing your search above and press return to search.

వార‌సురాలితో సూప‌ర్‌స్టార్ ప్ర‌యోగానికి బ్రేక్!

ప‌రిశ్ర‌మ‌లో ఎదురేలేని సూప‌ర్ స్టార్ గా బాక్సాఫీస్ కింగ్ గా ఉన్న పాపుల‌ర్ హీరో త‌న కుమార్తెను పెద్ద స్టార్ ని చేయాల‌ని ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు

By:  Tupaki Desk   |   3 Feb 2024 4:01 AM GMT
వార‌సురాలితో సూప‌ర్‌స్టార్ ప్ర‌యోగానికి బ్రేక్!
X

ప‌రిశ్ర‌మ‌లో ఎదురేలేని సూప‌ర్ స్టార్ గా బాక్సాఫీస్ కింగ్ గా ఉన్న పాపుల‌ర్ హీరో త‌న కుమార్తెను పెద్ద స్టార్ ని చేయాల‌ని ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. కానీ గారాల ప‌ట్టీ న‌టించిన‌ ఓటీటీ డెబ్యూ ఆశించినంత‌గా రాణించ‌క‌పోవ‌డంతో క‌నీసం పెద్ద తెర కెరీర్ ఆరంగేట్రం అయినా అద్భుతంగా సాగాల‌ని కోరుకున్నారు. దీనిలో భాగంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో ఓ స్క్రిప్టును కూడా లాక్ చేసారు. ఇందులో తాను కూడా కుమార్తెతో క‌లిసి న‌టించాల‌ని అనుకున్నారు. ఈ సినిమాకి కింగ్ అనే టైటిల్ ని కూడా పెట్టారు. కానీ ఇంత‌లోనే ఏమైందో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి సౌండ్ వినిపించ‌డం లేదు. చాలా కాలంగా దీనిపై చ‌ర్చ లేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయిందంటూ కొత్త ప్ర‌చారం ఊపందుకుంది.

ఈ ఎపిసోడ్ లో తండ్రి కూతుళ్లు ఎవ‌రో కాదు షారూఖ్‌- సుహానా ద్వ‌యం. పాపుల‌ర్ ఫిలింమేక‌ర్ సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ - సుహానా ఖాన్ ఒక చిత్రంలో కలిసి నటించాల్సి ఉంది. సుహానా గత ఏడాది జోయా అక్తర్ ది ఆర్చీస్‌తో అరంగేట్రం చేసింది. OTTలో విడుదలైన ఈ చిత్రం, సుహానా నటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఆర్చీస్ తరువాత సుజోయ్ ఘోష్ కొత్త చిత్రం కోసం తండ్రీ-కూతురు ద్వయం ఒకటవుతున్నార‌ని పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా సెట్స్ కెళ్ల‌లేద‌నే వాదన వినిపిస్తోంది. ఓ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాని ది ఆర్చీస్ త‌ర్వాత కాకుండా, కొంత గ్యాప్ ఇచ్చి చేయాల‌ని బాద్ షా షారూఖ్ భావించిన‌ట్టు తెలుస్తోంది.

SRK - సుహానా కాంబినేష‌న్ మూవీ గురించి మొదటిసారి గత ఏడాది జూన్‌లో క‌థ‌నాలొచ్చాయి. సుహానా బిగ్ స్క్రీన్ అరంగేట్రం ఘ‌నంగా ఉండాల‌ని ఖాన్ భావించిన‌ట్టు ఒక సోర్స్ తెలిపింది. పాపుల‌ర్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ సిద్ధార్థ్ ఆనంద్ సహ నిర్మాతగా కొన‌సాగుతార‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. గ‌త నవంబర్‌లో దర్శకుడిగా సుజోయ్ ఘోష్‌ని తీసుకున్నట్టు తెలిసింది. ఈ చిత్రానికి కింగ్ అని పేరు పెట్టారు. యాక్షన్ థ్రిల్లర్ క‌థాంశంతో ఇది తెర‌కెక్కాల్సి ఉంది. కానీ ప్రాజెక్ట్ సెట్స్ కి వెళ్ల‌లేదు. తాజా మీడియా క‌థ‌నాల‌పై షారుఖ్, సుహానా ఇంకా స్పందించలేదు. మీడియాకి అధికారికంగా ఏదీ చెప్ప‌నేలేదు. షారుఖ్ చివరిసారిగా డంకీలో కనిపించాడు. అతడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు.