Begin typing your search above and press return to search.

షాపింగ్‌లో మొర‌టోడు ఈ స్టార్ హీరో?

అలాంటి ఒక వ్య‌క్తి ఇప్పుడు న్యూయార్క్ లోని ఒక షూ షాప్ లో క‌నిపించాడు. అది కూడా త‌న ఎదిగొచ్చిన‌.. భ‌విష్య‌త్ స్టార్ కాబోతున్న కుమార్తెతో క‌లిసి షాపింగుకి వ‌చ్చాడు.

By:  Tupaki Desk   |   11 July 2024 7:09 AM GMT
షాపింగ్‌లో మొర‌టోడు ఈ స్టార్ హీరో?
X

బాలీవుడ్ లో కింగ్ ఖాన్ గా పేరున్న షారూఖ్ డౌన్ టు ఎర్త్ స్వ‌భావం అంద‌రినీ ఆక‌ర్షిస్తుంది. అత‌డు త‌న అభిమానుల‌తో ఎంతో చ‌నువుగా క‌లిసిపోతాడు. ఒక సాధార‌ణ యువ‌కుడిలా ప్ర‌వ‌ర్తిస్తాడు. వారితో సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్ ల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్ట‌డు. అలాంటి ఒక వ్య‌క్తి ఇప్పుడు న్యూయార్క్ లోని ఒక షూ షాప్ లో క‌నిపించాడు. అది కూడా త‌న ఎదిగొచ్చిన‌.. భ‌విష్య‌త్ స్టార్ కాబోతున్న కుమార్తెతో క‌లిసి షాపింగుకి వ‌చ్చాడు.

అయితే షాప్ లో అత‌డి అల్ల‌రి, మొర‌టుత‌నం కెమెరాల్లో బంధిఖానా అవ్వడంతో ఆ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యాయి. నిజానికి షారూఖ్ షాప్ కి వెళ్లి అక్క‌డ త‌న‌తో మాట్లాడాలనుకున్న అభిమానుల‌తో ఎంతో చ‌నువుగా మాట్లాడాడు. షూస్ ని ఒక సాధార‌ణ యువ‌కుడిలా త‌ర‌చి చూస్తూ వాటిని ఎంపిక చేసుకున్నాడు. అయితే అత‌డు చూడ‌టానికి మాత్ర‌మే చాలా మొర‌టుగా క‌నిపించాడు. కానీ తాను ఎలాంటి జెంటిల్మ‌న్ అన్న‌ది .. ఎంత సింపుల్ గా ఉంటాడు అన్న‌ది న్యూయార్క్ షాపింగ్ లో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది.

ఖాన్ వ్య‌వ‌హార శైలిపై ఇప్పుడు ఆన్ లైన్ లో ఆస‌క్తిక‌ర డిబేట్ కొన‌సాగుతోంది. అత‌డు మొర‌టువాడు అని ఒక‌రు కామెంట్ చేయ‌గా, అలాంటిదేమీ లేదు... షాప్ లో త‌న‌ను క‌లిసిన ప్ర‌తి అభిమానితో ఎంతో ప్రేమ‌గా మాట్లాడాడు.. అందుకే అత‌డు కింగ్ ఖాన్ అంటూ ప్ర‌శంసించిన వారు ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఖాన్ ఇప్పుడు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాడు. కూతురు సుహానాతో క‌లిసి షాపింగ్ చేస్తున్నాడు.

అంతేకాదు సుహానాతో క‌లిసి ఒక భారీ యాక్ష‌న్ సినిమాలో న‌టించేస్తున్నాడు. ప‌ఠాన్- జ‌వాన్- డుంకీ సినిమాల‌తో హ్యాట్రిక్ లు అందుకుని ఇదే ఉత్సాహంలో డ‌బుల్ హ్యాట్రిక్ కోసం ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. అందుకు సంబంధించిన చురుకుద‌నం అత‌డిలో క‌నిపిస్తోంద‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. కెమెరాలు త‌న‌ను వెంబ‌డించినా కానీ అత‌డు చిన్న‌పిల్లాడిలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడని కూడా అభిమానుల్లో ముచ్చ‌ట సాగుతోంది.