Begin typing your search above and press return to search.

వెయ్యి కోట్ల మూవీ సీక్వెల్ సూపర్ అప్డేట్‌

ఈ మధ్య కాలంలో అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. హిట్ సినిమాలకు వరుసగా ప్రాంచైజీలు వస్తున్నాయి

By:  Tupaki Desk   |   20 Feb 2024 11:37 AM GMT
వెయ్యి కోట్ల మూవీ సీక్వెల్ సూపర్ అప్డేట్‌
X

ఈ మధ్య కాలంలో అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా సీక్వెల్స్ ట్రెండ్‌ నడుస్తోంది. హిట్ సినిమాలకు వరుసగా ప్రాంచైజీలు వస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా పలు సూపర్‌ హిట్ సినిమాలకు సీక్వెల్స్ రూపొందుతున్నాయి. అందులో భాగంగానే గత ఏడాది వచ్చిన పఠాన్ సినిమాకు సీక్వెల్‌ రాబోతుందట.

షారుఖ్ ఖాన్‌ దశాబ్ద కాలం పాటు సక్సెస్‌ లేక కెరీర్ ఖతం అనుకుంటూ ఉన్న సమయంలో పఠాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లను పఠాన్ నమోదు చేయడం ద్వారా షారుఖ్‌ ఖాన్‌ స్థాయి, స్టామిన ఏంటో నిరూపితం అయ్యింది.

తాజాగా పఠాన్ 2 పై నిర్మాత ఆదిత్య చోప్రా అధికారికంగా ప్రకటన చేశాడు. ఈ ఏడాది డిసెంబర్ లో సీక్వెల్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. అంతే కాకుండా పఠాన్ కంటే మరింత గొప్పగా ఈ సీక్వెల్‌ ఉండబోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు.

గత ఏడాది పఠాన్ తో పాటు జవాన్ మరియు డంకీ సినిమాలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాదిలో పఠాన్ 2 సినిమా తో మరో విజయాన్ని షారుఖ్‌ ఖాన్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. జవాన్ కి కూడా సీక్వెల్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అట్లీ ఆలోచన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.