Begin typing your search above and press return to search.

షారుక్ నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్!

పాన్ ఇండియాలో టాలీవుడ్ గ్రోత్...ఆస్కార్ లాంటి గుర్తింపులు..కోలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల‌తో లాంచ్ అవ్వ‌డం వంటి స‌న్నివేశాలు ఖాన్ భాయ్ తో ఆలా మాట్లాడించాయి.

By:  Tupaki Desk   |   10 Sep 2023 12:30 AM GMT
షారుక్ నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్!
X

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ 'జ‌వాన్' విజ‌యంతో బాక్సాఫీస్ పీటాన్నే కుదిపేసాడు. లాంగ్ ర‌న్ లో సినిమా అన్ని రికార్డుల‌ను చెరిపేస్తుంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. ఆ రకంగా జ‌వాన్ కింగ్ ఖాన్ కెరీర్ లో ఓ చరిత్ర అని చెప్పొచ్చు. ఈ చ‌రిత్ర‌కి కార‌ణం త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ. షారుక్ ని అభిమానించే దర్శ‌కుల్లో అట్లీ ఒక‌డు. ఎంతో అభిమానంతో సినిమా తీసి విజ‌యం రూపంలో ఓ బ‌హుమ‌తి అందించాడు.

అంత‌కు మందు కోలీవుడ్ లో షారుక్ కి ఘ‌న‌మైన స్వాగ‌తం ద‌క్కింది. త‌మిళ ప‌రిశ్ర‌మ‌తో ఆయ‌న‌కు మంచి అనుబంధం ఉంది. సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్...క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాల‌తో ప్రెండ్ షిప్ ఉంది.

షారుక్ భాయ్ ని అభిమానించే అభిమానులెంతో మంది త‌మిళ‌నాడులో ఉన్నారు. అందుకే కోలీవుడ్ అంటే షారుక్ ప్ర‌త్యేక‌మైన అభిమానం చూపిస్తుంటారు. షారుక్ ఇప్పుడు అక్క‌డ స్ట్రెయిట్ సినిమా చేసినా ఆశ్చ‌ర్య‌పో వాల్సిన ప‌నిలేదు.

కానీ షారుక్ టార్గెట్ అది కాదు..టాలీవుడ్ అని తెలుస్తోంది. ఇటీవ‌లే సూపర్ స్టార్ మ‌హేష్ తో క‌లిసి పనిచేయాలి ఉంద‌న్న మ‌న‌సులో కోర్కెను బ‌య‌ట పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈవిష‌యాన్ని తొలిసారి షారుక్ ప‌బ్లిక్ గా పంచుకున్నారు. పాన్ ఇండియాలో టాలీవుడ్ గ్రోత్...ఆస్కార్ లాంటి గుర్తింపులు..కోలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల‌తో లాంచ్ అవ్వ‌డం వంటి స‌న్నివేశాలు ఖాన్ భాయ్ తో ఆలా మాట్లాడించాయి.

అలాగే స‌ల్మాన్ ఖాన్..అమితాబ‌చ్చ‌న్ లాంటి దిగ్గ‌జాలు ఇప్ప‌టికే తెలుగు తెర‌పై క‌నిపించారు. ఛాన్స్ వ‌స్తే మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కూడా తెలుగు సినిమాలు చేయ‌డానికి రెడీగా ఉన్నారు. ఈ సంకేతాల‌న్ని షారుక్ ఖాన్ ని టాలీవుడ్ వైపు పురిగొల్పించాయి. అందుకే తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి స్నేహితుడైన మ‌హేష్ ని ట‌చ్ చేసారు. షారుక్ లాంటి న‌టుడు అడిగితే మ‌హేష్ కాదంటాడా? మ‌హేష్ సినిమాలో గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇచ్చినా చాలు తెలుగు అభిమానులు నెత్తిన పెట్టుకుంటారు.