Begin typing your search above and press return to search.

షారుక్.. మరి నెక్స్ట్ ఏంటి?

తాజాగా షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తాను నెక్స్ట్ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది నా కొత్త సినిమా మార్చి లేదా ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుందని చెప్పాడు.

By:  Tupaki Desk   |   22 Dec 2023 3:42 AM GMT
షారుక్.. మరి నెక్స్ట్ ఏంటి?
X

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో పఠాన్ థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. వెయ్యి కోట్లకి కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. నెక్స్ట్ జవాన్ మూవీ ఈ ఏడాది రెండో అర్ధభాగంలో రిలీజ్ అయ్యి సంచలన విజయం నమోదు చేసింది.

డిసెంబర్ 21న రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో చేసిన డంకీ మూవీ థియేటర్స్ లోకి వచ్చి ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇలాంటి క్లాసిక్ మూవీస్ మెల్లగా పుంజుకుంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షారుఖ్ మూవీని భాగా ఆడించాలని సలార్ కి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇక డంకీ కూడా రిలీజ్ కావడంతో షారుఖ్ ఖాన్ నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏమై ఉంటాయనే చర్చ మొదలైంది. తాజాగా షారుఖ్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో తాను నెక్స్ట్ చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది నా కొత్త సినిమా మార్చి లేదా ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుందని చెప్పాడు. తన వయస్సుకి మించి పాత్రని పోషించాలని ఉందని, అలాంటి క్యారెక్టరైజేషన్ తోనే నెక్స్ట్ మూవీ ఉంటుందని అన్నారు.

అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరనేదానిపై మాత్రం షారుఖ్ ఖాన్ క్లారిటీ ఇవ్వలేదు. పెద్ద స్టార్ డైరెక్టర్ తోనే షారుఖ్ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే జవాన్ తో అట్లీ షారుఖ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అందుకే సౌత్ దర్శకుల నుంచి కూడా కథలు వినే ప్రయత్నం షారుఖ్ ఖాన్ చేస్తున్నారంట. ఎవరితో కన్ఫర్మ్ అవుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పాలి. అట్లీ మెప్పిస్తే అతనితోనే సినిమా చేయవచ్చు అనే టాక్ వస్తోంది.

యష్ రాజ్ ఫిలిమ్స్ లోనే పఠాన్ వెర్సస్ టైగర్ మూవీ కూడా షారుఖ్ పట్టాలు ఎక్కించాలని అనుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. డంకీ మూవీ హిట్ అయ్యి మంచి వసూళ్లు సాధిస్తే మాత్రం ఒకే ఏడాదిలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా షారుఖ్ ఖాన్ నిలబడిపోతాడు.