Begin typing your search above and press return to search.

ఆ స్టార్ కోసం ట్రాన్స్ పోర్ట‌ర్స్..అవెజెంర్స్ గ్యాంగ్!

బాద్ షా షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అట్లీ 'జ‌వాన్' తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Aug 2023 10:06 AM GMT
ఆ స్టార్ కోసం ట్రాన్స్ పోర్ట‌ర్స్..అవెజెంర్స్ గ్యాంగ్!
X

బాద్ షా షారుక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా అట్లీ 'జ‌వాన్' తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతోన్న చిత్రంపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. 'ప‌ఠాన్' తో స‌క్సెస్ ఖాతాలో వేసుకున్న ఖాన్ భాయ్ 'జ‌వాన్' తోనూ మ‌రో హిట్ ని న‌మోదు చేస్తాడంటూ అభిమానులు కాన్పిడెంట్ గా ఉన్నారు. అట్లీకి ఇంత‌వ‌ర‌కూ వైఫ‌ల్యం లేదు. చేసిన ప్ర‌తీది భారీ విజ‌యం సాధించిందే.

ఈ నేప‌థ్యంలో షారుక్ ఖాన్ ఎంతో కాన్పిడెంట్ గా అవ‌కాశం క‌ల్పించాడు. అందుకు త‌గ్గ‌ట్టే జ‌వాన్ ఏమాత్రం త‌గ్గ‌కుండా తెర‌కెక్కిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే నెల‌లో సినిమా భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా కోసం ఏకంగా ఆరుగురు విదేశీ స్టంట్ మాస్ట‌ర్లు ప‌నిచేసిన‌ట్లు తెలుస్తోంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు అధిక ప్రాధాన్యంతో విదేశీ బృందాన్ని దించాల్సి వ‌చ్చింద‌ని యూనిట్ తెలిపింది.

అంత‌ర్జాతీయంగా పేరున్న స్పిరో ర‌జాటోస్..యూనిక్ బెన్ ..క్రెయిగ్ మాక్రే.. కెచా ఖంపక్టీ.. సునీల్ రోడ్రిగ్స్.. అన‌ల్ అర‌సు అనే స్టంట్ మాస్టర్లు సినిమాకి ప‌నిచేసారు. వీళ్లంతా హాలీవుడ్ దిగ్గ‌జ సినిమాల‌కి ప‌నిచేసి ప‌స్ట్ క్లాస్ టెక్నీషియ‌న్స్. 'ఫాస్ట్ అండ్ ప్యూరియ‌స్'.. 'ట్రాన్స్ పోర్ట‌ర్ -3'.. 'మ్యాడ్ మ్యాక్స్ ': 'ప్యూరీ రోడ్'.. 'అవెజంర్స్' లాంటి హాలీవుడ్ సినిమాల‌కు ప‌నిచేసారు. అలాగే ఇండియాలో కొన్ని భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు ఒక్కోక‌రుగా ప‌నిచేసిన సంద‌ర్భాలున్నాయి.

'జ‌వాన్' లో మ‌ల్ల యుద్దం స‌న్నివేశాలు..ఒళ్లు గ‌గుర్లు పొడిచేలా బైక్ స్టంట్లు.. కార్ ఛేజింగ్ వంటి భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు నెక్స్ట్ లెవ‌ల్లో ఉంటాయ‌ని అంటున్నారు. వాటి కోసం కోట్ల రూపాయ‌లు వెచ్చించారు. ఇందులో విజ‌య్ సేతుప‌తి విల‌న్ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇంకా విజ‌య్..సంజ‌య్ ద‌త్..దీపికా ప‌దుకోణే లాంటి స్టార్లు అతిధి పాత్ర‌లు పోషించారు. రెండ్ చిల్లీస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై షారుక్ ఖాన్ నిర్మించారు.