Begin typing your search above and press return to search.

ఒకే ఏడాది ఒకే హీరో... వెయ్యి కోట్ల సినిమాలు మూడు..!

ఆ సినిమాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటే ఆ హీరో పేరు మారు మ్రోగడం ఖాయం.

By:  Tupaki Desk   |   16 Sep 2023 4:39 AM GMT
ఒకే ఏడాది ఒకే హీరో... వెయ్యి కోట్ల సినిమాలు మూడు..!
X

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా తో కూడా రావడం లేదు. అలాంటిది ఒక స్టార్‌ హీరో ఏడాదికి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ హీరో అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఆ సినిమాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటే ఆ హీరో పేరు మారు మ్రోగడం ఖాయం.

ఇప్పుడు బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ ఫ్యాన్స్ ఆ ఆనందం ఎంజాయ్ చేస్తున్నారు. దశాబ్ద కాలంగా సక్సెస్ లేక ఢీలా పడ్డ షారుఖ్ ఖాన్‌ కి ఈ ఏడాది ఆరంభం లో వచ్చిన పఠాన్ సినిమా భారీ విజయాన్ని కట్టబెట్టిన విషయం తెల్సిందే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమా షారుఖ్‌ స్థాయిని నిరూపించింది అనడంలో సందేహం లేదు.

పఠాన్ సినిమా విడుదల అయిన కొన్ని నెలల్లోనే జవాన్ సినిమా వచ్చింది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే దాదాపు రూ.800 కోట్ల వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

ఒక వైపు జవాన్ వెయ్యి కోట్ల వైపు దూసుకు వెళ్తూ ఉంటే మరో వైపు షారుఖ్‌ ఖాన్‌ డుంకీ సినిమా తో రెడీ అవుతున్నాడు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ను ఇదే ఏడాది డిసెంబర్‌ లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. కానీ డుంకీ సినిమా మేకింగ్ విషయంలో ఆలస్యం అవ్వడంతో ఈ ఏడాది విడుదల అవ్వడం సాధ్యం కాదు అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది.

డుంకీ ఆలస్యం గురించి వస్తున్న వార్తలపై షారుఖ్‌ ఖాన్‌ స్పందించాడు. కచ్చితంగా క్రిస్మస్‌ కానుకగా డుంకీ సినిమా విడుదల అవ్వబోతుందని ప్రకటించాడు. ఈ సినిమాకు రాజ్ కుమార్‌ హిరానీ దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కేవలం షారుఖ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రాజ్ కుమార్ హిరానీ కి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యం లో దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.

రాజ్‌ కుమార్ గత చిత్రాల అనుభవం మరియు ఇతర విషయాల కారణంగా డుంకీ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేయడం ఖాయం అంటూ హిందీ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. డుంకీ కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేస్తే ఒకే ఏడాది.. ఒకే హీరో వెయ్యి కోట్ల సినిమాలు మూడు చేసిన అరుదైన రికార్డ్‌ షారుఖ్‌ ఖాన్‌ కి దక్కుతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అరుదైన రికార్డ్‌ కచ్చితంగా రాబోయే ఇరవై ఏళ్లలో మరే హీరోకి కూడా సాధ్యం కాకపోవచ్చు.