Begin typing your search above and press return to search.

జ‌వాన్‌తో నైజాంలో రాజ‌భోగం అందుకునే సంస్థ‌?

కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన జ‌వాన్ ఓపెనింగుల రికార్డుల గురించి చాలా ముందే ట్రేడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   3 Sept 2023 11:29 AM IST
జ‌వాన్‌తో నైజాంలో రాజ‌భోగం అందుకునే సంస్థ‌?
X

కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన జ‌వాన్ ఓపెనింగుల రికార్డుల గురించి చాలా ముందే ట్రేడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప‌ఠాన్ లాంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత షారూఖ్ న‌టించిన సినిమాగా జ‌వాన్ పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. దానికి త‌గ్గ‌ట్టే రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్ లో అత్యంత భారీ బ‌డ్జెట్ ని ఖాన్ కుమ్మరించి మ‌రీ ఈ సినిమాని నిర్మించాడు. ఇందులో ఫైట్స్ స‌హా ప్ర‌తిదీ యూనిక్ గా ఉండేందుకు భారీత‌నం చూపించేందుకు అసాధార‌ణ‌ పెట్టుబ‌డులు పెట్టారు. అది ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ ట్రైల‌ర్ లో అర్థ‌మైంది.

ఇప్ప‌టికే భార‌త‌దేశం స‌హా దేశ విదేశాల్లో అద్భుత‌మైన బుకింగులు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌లు, పివిఆర్, ఐనాక్స్, సినీపోలిస్‌లలో 2 లక్షలకు పైగా టిక్కెట్‌లను విక్రయించారు. ఈ చిత్రం 2017లో బాహుబలి 2 విక్రయించిన 6.5 లక్షల టిక్కెట్‌ల రికార్డును అధిగ‌మించాలని చూస్తోంది. పఠాన్ 5.6 లక్షల టిక్కెట్‌ల SRK సొంత రికార్డును కూడా బద్దలు కొట్టాలని చూస్తోంది.

అలాగే హైద‌ర‌బాద్ లోను జవాన్ అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయ‌ని ట్రేడ్ చెబుతోంది. కేవ‌లం ఈ మెట్రో న‌గ‌రంలోనే జవాన్‌కు 250కి పైగా షోలు కేటాయించగా, 180 షోల టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడ‌వుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా మరిన్ని షోలను పెంచుతున్న‌ట్టు తెలిసింది. టికెట్ సేల్ కూడా అంతే వేగంగా ఉంద‌ని చెబుతున్నారు. పీవీఆర్ - ఐనాక్స్ అధికార బృందాల‌ను సిబ్బందిని సంప్ర‌దించ‌గా..వారంతా చెబుతున్నది ఒక‌టే.. జ‌వాన్ ఓపెనింగుల్లో భారీ రికార్డులు సాధ్య‌మ‌వుతాయ‌ని ఏక కంఠంతో చెబుతున్నారు. అయితే ఇది బాహుబ‌లి ఓపెనింగుల రికార్డుల్ని బ్రేక్ చేస్తుందా లేదా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.

దిల్ రాజు వ‌ర్సెస్ రాజ‌శ్రీ‌

అయితే ఇంత క్రేజ్ ఉన్న `జ‌వాన్` నైజాం రైట్స్ విష‌యంలో దిల్ రాజు తో పోటీప‌డుతూ రాజ‌శ్రీ పిక్చ‌ర్స్ ద‌క్కించుకుంది. చివ‌రి నిమిషంలో రాజుగారు కాద‌నుకోగా, రాజ‌శ్రీ సంస్థ జ‌వాన్ నైజాం రిలీజ్ హ‌క్కుల్ని ఛేజిక్కించుకుంద‌నేది టాక్. నైజాంకి హైద‌రాబాద్ మెట్రో థియేట‌ర్లు పెద్ద అండ‌. న‌గ‌ర‌వ్యాప్తంగా భారీ షోల‌తో ఓపెనింగు రికార్డులు సాధ్య‌మేన‌ని భావిస్తున్నారు. అలాగే భారీ య‌క్ష‌న్ చిత్రం కాబ‌ట్టి నైజాం వ్యాప్తంగా అద్భుత క‌లెక్ష‌న్లు సాధించేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. దిల్ రాజు లాస్.. రాజ‌శ్రీ గెయిన్ అంటూ ఇండ‌స్ట్రీ ట్రేడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జ‌వాన్ చిత్రానికి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..ఖాన్ స‌ర‌స‌న న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. షారూఖ్ - న‌య‌న్ జంట రొమాన్స్ పెద్ద తెర‌పై వ‌ర్క‌వుటైంద‌ని ఇంత‌కుముందు విడుద‌లైన సాంగ్స్ వెల్ల‌డిస్తున్నాయి.