Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో హ్యాట్రిక్ లాంఛ‌న‌మేనా!

ప్ర‌స్తుతం ఆయ‌న క‌థానాయ‌కుడి రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో 'డుంకీ' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Sep 2023 2:30 PM GMT
ఆ స్టార్ హీరో హ్యాట్రిక్ లాంఛ‌న‌మేనా!
X

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. 'ప‌ఠాన్'..'జ‌వాన్' విజ‌యాల‌తో ఖాన్ భాయ్ రెట్టింపు ఆనందం లో ఉన్నారు. రెండు సినిమాలు రెండువేల కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించాయి. ఒక్కో సినిమా వేయి కోట్లు చొప్పున బాక్సాఫీస్ వ‌ద్ద మోత మోగించే స‌రికి షారుక్ సైతం ఆశ్చ‌ర్యంలోనే క‌నిపిస్తున్నారు. ఒకేసారి రెండు విజ‌యాలు బ్యాక్ టూ బ్యాక్ అందుకుంటాడ‌ని ఆయ‌న కూడా ఊహించ‌లేదు.


స్టోరీ స‌హా మేకింగ్..షారుక్ ఇమేజ్ అలా అన్ని క‌ల‌సి రావ‌డంతో రెండు చిత్రాలూ బాక్సాపీస్ వ‌ద్ద మోత మ్రోగించాయి. ఈ నేప‌థ్యంలో షారుక్ ఖాతాలో మ‌రోసారి హ్యాట్రిక్ లాంఛ‌న‌మేనా? అంటే అవున‌నే గ‌ట్టి ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న క‌థానాయ‌కుడి రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో 'డుంకీ' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. షారుక్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే! ఈ సినిమాకి ప‌నిచేసేది రాజ్ కుమార్ హిరాణీ.

ఇండియాలోనే గ్రేట్ మేక‌ర్ గా ఆయ‌న‌కు పేరుంది. ఆయ‌న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్ల వ‌సూళ్లు సాధించాయి. ఇప్ప‌టివ‌ర‌కూ అప‌జ‌యం అన్న‌ది ఆయ‌న ఖాతాలో లేదు. 'మున్నాభాయ్ ఎంబీ బీఎస్'.. 'ల‌గే ర‌హో మున్నాభాయ్' సంజ‌య్ ద‌త్ కెరీర్ లోనే మైల్ స్టోన్ చిత్రాలుగా నిలిచాయి. అటుపై తెర‌కెక్కించిన 'త్రీ ఇడియ‌ట్స్'..'పీకే'.. 'సంజు' లాంటి చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాలు.

బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల్నే న‌మోదు చేసాయి. ఆ రెండు సినిమాలే 1500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించాయి. ఈ విజ‌యాల‌తో రాజ్ కుమార్ పేరు పాన్ ఇండియాలో బాగా ఫేమ‌స్ అయింది. ఆయ‌న సినిమాలు చేయ‌డానికి కూడా చాలా గ్యాప్ తీసుకుంటారు. 'డుంకీ' చిత్రం కోసం ఏకంగా నాలుగేళ్లు స‌మ‌యం తీసుకున్నారు.

క‌థ ప‌రంగా అంతా ఒకే అయిన త‌ర్వాత బోలెడంత క‌స‌ర‌త్తులు చేసారు. ఇక సెట్స్ కి వెళ్లిన త‌ర్వాత చిత్రాన్ని చెక్కుతూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని షారుక్- రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇది సంల‌చ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఎన‌లిస్ట్ లు భావిస్తున్నారు.