Begin typing your search above and press return to search.

షారుఖ్ వాచ్ తో హైదరాబాద్ లో లగ్జరీ విల్లా !

షారుక్ చేతికి ఉన్న వాచ్ రిచర్డ్ మిల్ RM 052 టూర్‌బిల్లాన్ స్కల్ టైటానియం అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   27 May 2024 1:41 PM GMT
షారుఖ్ వాచ్ తో హైదరాబాద్ లో లగ్జరీ విల్లా !
X

అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో రిచెర్డ్ మిల్లే స్విచ్ వాచ్ ను చూసి దాని ఖరీదు తెలుసుకుని ఏకంగా మార్క్ జుకర్ బర్గ్ దంపతులు ఆశ్చర్యపోవడం అది మీడియాలో ప్రముఖంగా చర్చకు రావడం తెలిసిందే. అనంత్ ధరించిన వాచ్ ఖరీదు రూ.16 నుండి 18 కోట్లు ఉంటుందని వార్తలు వెలువడ్డాయి.

తాజాగా ఐపీల్ 2024 టైటిల్ ను కోల్ కత నైట్ రైడర్స్ మూడోసారి గెలుచుకున్న తర్వాత దాని యజమాని షారుక్ ఖాన్ ఆటగాళ్లు అందిరతో కలిసి కెమెరా ముందు ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చారు. ఈ జట్టు గతంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచింది. ఈ సంధర్భంగా షారుక్ ఖాన్ చేతికి ఉన్న వాచ్ ను చూసి మరో సారి దాని ఖరీదు గురించి చర్చ వచ్చింది.

షారుక్ చేతికి ఉన్న వాచ్ రిచర్డ్ మిల్ RM 052 టూర్‌బిల్లాన్ స్కల్ టైటానియం అందరి దృష్టిని ఆకర్షించింది. 2012లో నమోదయిన దీని ధర దాదాపు రూ.4.15 కోట్లు అని తెలుస్తున్నది. షారుఖ్ వాచ్ ఖరీదుతో హైదరాబాద్ ఒక లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేయవచ్చని నెటిజెన్లు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కామెంట్లు చేస్తున్నారు.