Begin typing your search above and press return to search.

2 నెలల్లో ఓటీటీలోకి.. మన మేకర్స్ కూడా ఇలా చేయొచ్చుగా!

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   8 Feb 2024 6:30 AM GMT
2 నెలల్లో ఓటీటీలోకి.. మన మేకర్స్ కూడా ఇలా చేయొచ్చుగా!
X

సలార్ వర్సెస్ డంకీ.. గతేడాది డిసెంబర్ లో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడిచింది. ఇద్దరు బడా హీరోలు నటించిన సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లోనే రిలీజ్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాషే ఉంటుందని అంతా ఊహించారు. అయితే షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో వచ్చిన డంకీ మూవీ మిక్స్ డ్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు సాధించినప్పటికీ.. సూపర్ హిట్ టాక్ సంపాదించుకోలేకపోయింది.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చేయించింది. రిలీజైన అన్ని సెంటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నీల్ ఇచ్చిన ఎలివేషన్లకు ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోయారు. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది సలార్.

నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సలార్ మూవీ అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలే ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్ కూడా స్టార్ అయింది. అయితే సలార్ సినిమాకు ఒక్కరోజు ముందు రిలీజైన డంకీ మూవీ మాత్రం ఇంకా ఓటీటీలోకి రాలేదు. డంకీ మూవీ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న జియో సినిమాలో ఈ మూవీ ఫిబ్ర‌వ‌రి 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలిసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట.

అయితే సలార్ రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేయగా.. డంకీ మాత్రం సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలో వస్తోంది. ఇప్పుడు ఇదే విషయం.. నెట్టింట చర్చకు దారి తీసింది. బాలీవుడ్ మేకర్స్ తమ సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్ ల విషయంలో చాలా గ్యాప్ తీసుకుంటారని చెబుతున్నారు నెటిజన్లు. ఇంకా కొన్ని థియేటర్లలో సినిమా ఆడుతూ ఉంటోందని, అందుకే ఇలా చేస్తారని అంటున్నారు.

ఓటీటీ రిలీజ్ కాస్త లేట్ గా చేయడం వల్ల థియేట్రికల్ బిజినెస్ దెబ్బతినదని అంటున్నారు సినీ ప్రియులు. టాలీవుడ్ మేకర్స్ కూడా ఈ విషయాన్ని ఓసారి పరిశీలిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. కొన్ని సినిమాలు విడుదలైన నెల కన్నా తక్కువ రోజుల్లోపే ఓటీటీలో రిలీజ్ అవ్వడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి టాలీవుడ్ మేకర్స్.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాలి.