Begin typing your search above and press return to search.

'గుంటూరు కారం'పై షారూఖ్ ఆస‌క్తి

సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టించిన 'గుంటూరు కారం' ఈ శుక్ర‌వారం థియేటర్లలోకి వచ్చింది

By:  Tupaki Desk   |   13 Jan 2024 6:58 PM GMT
గుంటూరు కారంపై షారూఖ్ ఆస‌క్తి
X

సూపర్ స్టార్ మహేష్ బాబు న‌టించిన 'గుంటూరు కారం' ఈ శుక్ర‌వారం థియేటర్లలోకి వచ్చింది. భారీ హైప్ న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. అయితే మ‌హేష్ ఛ‌రిష్మాతో భారీ ఓపెనింగులు సాధించింది. ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజం షారూఖ్ ఖాన్ ఈ చిత్రానికి తన మద్దతును తెలియజేసారు. గుంటూరు కారం చిత్రాన్ని థియేట‌ర్ల‌లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన‌ని తెలిపారు.

సోషల్ మీడియా ఖాతా Xలో SRK ఇలా రాసారు. ''గుంటూరు కారం కోసం ఎదురు చూస్తున్నాను. నా స్నేహితుడు మ‌హేష్ .. యాక్షన్, ఎమోషన్ పండించే తీరు మంచి రైడ్. మాస్!! లో బాగా మరిగిస్తాడు!'' అని వ్యాఖ్యానించిన ఖాన్ ట్వీట్‌ పాటు సినిమా ట్రైలర్‌ను కూడా షేర్ చేశాడు. నిజానికి షారూఖ్ తో సూప‌ర్ స్టార్ మ‌హేష్ అనుబంధం ఎంతో గొప్ప‌ది. గ‌త సెప్టెంబరులో జవాన్ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు X ఖాతాలో రివ్యూ రాశారు. ''జవాన్.. బ్లాక్‌బస్టర్ సినిమా… అట్లీ సర్ కింగ్‌తో కింగ్ సైజ్ వినోదాన్ని అందించాడు! ఆయ‌న‌ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంతో ముందుకు వచ్చాడు... షారుఖ్ ఖాన్ ప్రకాశం, చరిష్మా స్క్రీన్ ప్రెజెన్స్ సాటిలేనివి... ఆయ‌న‌ ఇక్కడ ఫైర్ అవుతున్నాడు. ఖాన్ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తాడు... ఎంత బాగుంది! ఇతిహాసం తీసారు'' అని ప్ర‌శంసించారు. దానికి షారూఖ్ ఖాన్ వెంట‌నే స్పందించి కృతజ్ఞతలు తెలిపాడు. ఇప్పుడు మ‌హేష్ న‌టించిన గుంటూరు కారం సినిమాని చూస్తాన‌ని షారూఖ్ అన్నారు. దానికోసం ఆస‌క్తిగా ఉన్నాన‌ని తెలిపారు. అంటే గుంటూరు కారంపై ఖాన్ త‌న ట్వీట్ రివ్యూ ఇవ్వ‌బోతున్నార‌ని భావించాలి.

జ‌న‌వ‌రి 12న విడుద‌లైన గుంటూరు కారం ప్రారంభ రోజున ప్రపంచవ్యాప్తంగా 94 కోట్ల గ్రాస్‌ను వ‌సూలు చేసింద‌ని చిత్ర‌బృందం అధికారికంగా పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. ప్రాంతీయ చిత్రసీమలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని పేర్కొన్నారు. ప్ర‌స్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో ఇరువురు సూప‌ర్ స్టార్లు మ‌హేష్‌- షారూఖ్ క‌లిసి న‌టించాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆ ఇద్ద‌రూ క‌లిస్తే ఓపెనింగ్ డే వ‌సూళ్లు 200 కోట్లు దాటుతాయేమో! 1000 కోట్ల క్ల‌బ్ లు పెద్ద క‌ష్టం కాదు.