Begin typing your search above and press return to search.

నా కోసమంటూ అభిమానుల న‌రాల్లోకి!

భారీ ఎత్తున అడ్వాన్సు బుకింగ్ లు క‌నిపించ‌లేదు. జ‌వాన్..ప‌ఠాన్ రేంజ్ టికెట్లు తెగ‌డం లేదు అన్న బెంగ మొద‌లైంది

By:  Tupaki Desk   |   18 Dec 2023 12:13 PM GMT
నా కోసమంటూ అభిమానుల న‌రాల్లోకి!
X

'జ‌వాన్'..'ప‌ఠాన్' విజ‌యంతో షారుక్ ఖాన్ 2000 కోట్ల వ‌సూళ్ల‌ను సునాయాసంగా చేధించాడు. రెండు యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కావ‌డం స‌హా తొలి షోతోనే పాజిటివ్ టాక్..మంచి రివ్యూలు రావ‌డంవ‌తో బాక్సాఫీస్ వ‌ద్ద రారాజుగా దూసుకుపోయాడు. అంత‌కు ముందు భారీ ఎత్తున డ్వాన్స్ బుకింగ్ లు కింగ్ ఖాన్ లో ఎంతో సంతోషాన్ని నింపాయి. కానీ డంకీ విష‌యంలో స‌న్నివేశం రివ‌ర్స్ లో క‌నిపిస్తోంది.

భారీ ఎత్తున అడ్వాన్సు బుకింగ్ లు క‌నిపించ‌లేదు. జ‌వాన్..ప‌ఠాన్ రేంజ్ టికెట్లు తెగ‌డం లేదు అన్న బెంగ మొద‌లైంది. అందుకు నేరు గాషారుక్ ఖాన్ టికెట్టు కొనండి అంటూ సోష‌ల్ మీడియా ద్వారా అభిమాను ల‌కు సందేహం పంపించాడు. మ‌రోవైపు వ్య‌క్తిగ‌త ఇంట‌ర్వ్యూల‌తో డంకీని వీలైనంతగా జ‌నాల్లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా అభిమానుల న‌ర‌న‌రాల్లోకి డంకీని ఎక్కించేలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు.

ప‌ఠాన్..జ‌వాన్ తర్వాత నాకోసం నేను సినిమా చేయ‌లేద‌ని అర్ద‌మైంది. అందుకే డంకీ చేసాను. ఇది నా సినిమా. నా మ‌న‌సుకు ఎంతో ద‌గ్గ‌రైంది. ప‌ఠాన్ మ‌హిళ‌ల కోసం చేసాను. నా కోసం చేసిన సినిమాతో ఈ ఏడాదిని ముగించాల‌నుకుంటున్నా. రాజ్ కుమార్ హిరానీ దేశంలోనే గొప్ప ద‌ర్శ‌కుల్లో ఒక‌రు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఇలాంటి చిత్రాన్ని తెర‌కెక్కించ‌లేదు. డంకీ చూశాక ఆయ‌న గొప్ప ప్రేమ క‌థ‌ని తెర‌కెక్కించారని అర్ద‌మ‌వుతుంది.

ఇందులో విక్కీ విశాల్ అద్భుతంగా న‌టించాడు. త‌ను నాకు మంచి స్నేహితుడు అయ్యాడు. త‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా నేర్చుకున్నాను' అని అన్నారు. రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తాయ‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న కంటెంట్ కి జ‌నాల్లో పాజిటివ్ టాక్ వ‌చ్చిందంటే వంద‌ల కోట్లు వ‌సూళ్లు ఖాయం. ఆయ‌న గ‌త సినిమా పీకే ఎలాంటి రికార్డులు న‌మోదు చేసిందో తెలిసిందే.