Begin typing your search above and press return to search.

డంకీ ఓపెనింగ్స్.. ఆ రేంజ్ లోనా?

షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం డంకీ

By:  Tupaki Desk   |   17 Dec 2023 4:09 AM GMT
డంకీ ఓపెనింగ్స్.. ఆ రేంజ్ లోనా?
X

షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం డంకీ. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని సోషల్ ఎలిమెంట్ మిక్స్ చేసిన కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఆవిష్కరించారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఎలాంటి పాస్ పోర్ట్ లేకుండా సరిహద్దులు దాటి ఇంగ్లాండ్ వెళ్లాలని అనుకునే కొంతమంది వ్యక్తుల కథగా దీనిని డిజైన్ చేశారు.

ఇక ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడం, టూర్ ప్లాన్ వంటి ఎలిమెంట్స్, ఈ ప్రయాణంలో వారు ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నారు. అసలు ఇంగ్లీష్ ఎందుకు వెళ్లాలని అనుకున్నారు లాంటి ఎమోషనల్ పాయింట్స్ ని డంకీ సినిమాలో రాజ్ కుమార్ హిరాణీ చూపించబోతున్నారు. ఈ ఏడాది షారుఖ్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది.

పఠాన్, జవాన్ సినిమాలు రెండు కంప్లీట్ యాక్షన్ అండ్ కమర్షియల్ స్టొరీలైన్స్ తో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అయితే డంకీ మాత్రం వాటికి కంప్లీట్ ఆపోజిట్ గా క్లాస్ టచ్ ఉన్న స్టొరీ ఎంటర్టైన్మెంట్ తోనే సిద్ధం అవుతోంది. ఇలాంటి సినిమాలకి భారీ ఓపెనింగ్స్ రావడం కష్టం అని చెప్పాలి. ఫస్ట్ డే టాక్ చూసుకొని ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తారు.

అలాగే ఇలాంటి కథలని ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారు. వారు రిలీజ్ రోజు సినిమా చూసే ప్రయత్నం చేయరు. ఈ రీజన్స్ కారణంగా పఠాన్, జవాన్ తో పోల్చుకుంటే డంకీ ఓపెనింగ్స్ తక్కువగా ఉంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఓవరాల్ గా 75 కోట్ల గ్రాస్ మొదటి రోజు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కేవలం హిందీలో మాత్రమే ఈ సినిమాని రిలీజ్ చేయడం కూడా కలెక్షన్స్ మీద ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. పఠాన్, జవాన్ సౌత్ భాషలలో కూడా రిలీజ్ అయ్యి దక్షిణాది రాష్ట్రాలలో మంచి వసూళ్లు సాధించాయి. డంకీ సినిమాలో తాప్సి హీరోయిన్ గా నటిస్తోంది. విక్కీ కౌశల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.