Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?

ఈనేప‌థ్యంలో షారుక్ ఓవైపు సినిమా ప్ర‌చారం ప‌నుల్లో పాల్గొంటూనే మ‌రోవైపు గుడులు గోపురాలు చుట్టేస్తున్నారు

By:  Tupaki Desk   |   15 Dec 2023 5:39 AM GMT
స్టార్ హీరో సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
X

'ప‌ఠాన్'..'జ‌వాన్' విజ‌యాల‌తో షారుక్ ఖాన్ జోష్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రెండు సినిమాల‌కు 2000 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించ‌డంతో కింగ్ ఖాన్ ఆనందానికి అవ‌దుల్లేవ్. వరుస వైఫ‌ల్యాల త‌ర్వాత ఇలా అనూహ్యంగా రెండు విజ‌యాలు ఖాన్ భాయ్ ఫ్యామిలీలో ఎంతో సంతోషాన్ని నింపాయి. అదే రెట్టించిన ఉత్సాహంతో 'డంకీ'తోనూ హ్యాట్రిక్ అందుకోవాల‌ని చూస్తున్నాడు. ఈనెల 21న సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

ఈనేప‌థ్యంలో షారుక్ ఓవైపు సినిమా ప్ర‌చారం ప‌నుల్లో పాల్గొంటూనే మ‌రోవైపు గుడులు గోపురాలు చుట్టేస్తున్నారు. రెండు రోజుల క్రిత‌మే జ‌మ్ము లోని వైష్క్షోదేవాల‌యంలో షారుక్ ఖాన్ ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. కొన్ని గంట‌ల పాటు స‌మ‌యాన్ని కేటాయించి పూజా క్ర‌త‌వుల‌ను పూర్తి చేసి తిరిగొ చ్చారు. తాజాగా కుమార్తె సుహానా ఖాన్ తో క‌లిసి షిరిడీ సాయిబాబాని ద‌ర్శించుకున్నారు. సాయిబాబా మందిరంలోప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి ఆయ‌న ఆశీస్సులు అందుకున్నారు.

కింగ్ ఖాన్ ఇలా గోపురాలు చుట్టేయడం కొత్తేం కాదు. 'జ‌వాన్' రిలీజ్ కి ముందు వైష్ణోదేవి ఆల‌యంలో పూజ‌లు నిర్వ‌హించారు. ఆ సినిమా రిలీజ్ అనంత‌రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని కొన‌సాగిస్తూ 'డంకీ' రిలీజ్ కి ముందు ఏకంగా రెండు టెంపుల్స్ ని సంద‌ర్శించ‌డం విశేషం. డంకీతోనూ స‌క్సెస్ కొట్ట‌బోతున్నామ‌ని ముందుగానే ఇలా అభిమానుల‌కు హింట్ ఇచ్చేసారు షారుక్ ఖాన్.

ప్ర‌స్త‌తుం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈసారి కుమార్తెతో పూజ‌లో పాల్గొన‌డం విశేషం. ఇటీవ‌లే సుహానా ఖాన్ న‌టించిన' ది అర్చిస్' కూడా రిలీజ్ అయి మంచి టాక్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తండ్రితో పాటు కుమార్తె కూడా ఆదేవుడి ఆశీస్సులు పొందిన‌ట్లు తెలుస్తోంది. ఇక 'డంకీ' చిత్రాన్ని రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. షారుక్ తో పాటు తాప్సీ..విక్కీ కౌశ‌ల్..బోమ‌న్ ఇరానీ ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని 120 కోట్ల బ‌డ్జెట్ తో రెడ్ చిల్లీస్..జీ స్టూడియోస్...రాజ్ కుమార్ హిరాణీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి.