Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సెంటిమెంట్ షాకిస్తోందే!

కింగ్ ఖాన్ షారూఖ్ సెంటిమెంట్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఖాన్ లు హిందూ దేవ‌త‌ల‌ పూజ‌లు పున‌స్కారాల్లో పాల్గొన‌డం నిరంత‌రం అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేవే

By:  Tupaki Desk   |   12 Dec 2023 6:40 AM GMT
సూపర్ స్టార్ సెంటిమెంట్ షాకిస్తోందే!
X

కింగ్ ఖాన్ షారూఖ్ సెంటిమెంట్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఖాన్ లు హిందూ దేవ‌త‌ల‌ పూజ‌లు పున‌స్కారాల్లో పాల్గొన‌డం నిరంత‌రం అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేవే. ఒక‌మారు షారూఖ్ ఖాన్ లాంటి న‌టుడికి దేశ విదేశాల్లో ఎదురైన కొన్ని అవ‌మానాలను స‌వాళ్ల‌ను ప‌రిశీలిస్తే.. అత‌డు మ‌తాల‌కు అతీతంగా హిందూ దేవుళ్ల‌ను పూజించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇప్పుడు ప‌విత్ర హిందూ మాత అయిన‌ వైష్ణోదేవి ఆల‌య సంద‌ర్శ‌న‌లో అత‌డి సెంటిమెంట్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

దేవుళ్ల‌కు ఎవ‌రూ అతీతులు కాలేరు! అనే సందేశం ఖాన్ యాక్ట్ లో ఇమిది ఉంది. అంతేకాదు కింగ్ ఖాన్ ఈ ఏడాది ప‌ఠాన్, జ‌వాన్ లాంటి చిత్రాల‌తో భారీ విజ‌యాల్ని అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల క్లబ్ లు అందుకున్నాడు. ఇంత‌లోనే ఇదే ఏడాదిలో మ‌రో వెయ్యి కోట్ల క్ల‌బ్ ని అందుకోవాల‌ని త‌పిస్తున్న‌డు. దానికి డంకీ మూవీ స‌హ‌క‌రిస్తుంద‌ని ఆశిస్తున్నాడు. ట్యాలెంటెడ్ రాజ్ కుమార్ హిరాణీ తెర‌కెక్కించిన డంకీ చిత్రంతో మ‌రోసారి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవాల‌ని ఖాన్ త‌పిస్తున్నాడు. అదే క్ర‌మంలో అత‌డు ఇప్పుడు ఒకే ఏడాదిలో మూడోసారి జ‌మ్మూలోని ప‌విత్ర‌ వైష్ణోదేవి ఆల‌యాన్ని సంద‌ర్శించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

స‌రిగ్గా ఏడాది కింద‌ట కింగ్ ఖాన్ కంబ్యాక్ మూవీ ప‌ఠాన్ విడుద‌లైంది. ఈ మూవీ విడుద‌ల‌కు ముందు షారూఖ్ వైష్ణోదేవిని సంద‌ర్శించాడు. ప‌ఠాన్ అఖండ విజ‌యం సాధించి వెయ్యి కోట్ల క్ల‌బ్ లో చేరింది. ఇక ఇటీవ‌లే విడుద‌లైన జ‌వాన్ కు ముందు కూడా ఇలానే చేసాడు అత‌డు. రెండోసారి వైష్ణోదేవి దివ్య‌మైన ఆశీస్సులు అందుకుని భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. రెండు వ‌రుస 1000 కోట్ల క్ల‌బ్ లు అత‌డిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసాయి. ఇప్పుడు ఖాన్ రొటీన్ మీడియా ప్ర‌చారాన్ని ఆశ్ర‌యించ‌కుండా కేవ‌లం అమ్మ‌వారిని న‌మ్ముకున్నాడు. అత‌డు ఆల‌య సంద‌ర్శ‌న‌ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ప‌విత్ర వైష్ణోదేవి అమ్మవారి సెంటిమెంట్ అత‌డికి క‌లిసొచ్చింది. మూడోసారి ఘ‌న‌విజ‌యం కోసం అత‌డు సెంటిమెంటునే న‌మ్ముకున్నాడు. తాజాగా షారూఖ్ అత‌డి ప‌రివారం జ‌మ్మూలోని వైష్ణోదేవి ఆల‌య సంద‌ర్శ‌న‌కు వెళ్లిన‌ప్ప‌టి ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఖాన్ మొక్కు ఫ‌లించి డంకీతో 1000 కోట్ల క్ల‌బ్ అందుకుంటాడేమో చూడాలి. డంకీలో ఖాన్ తో పాటు తాప్సీ, బొమ‌న్ ఇరానీ త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమాని కేవ‌లం 80 కోట్ల బ‌డ్జెట్ (స్టార్ల పారితోషికాలు మిన‌హా)తో హిరాణీ తెర‌కెక్కించ‌డం మ‌రో రికార్డ్. కింగ్ ఖాన్ ఈ సినిమా కోసం వాటాల ప్రాతిప‌దిక‌న భారీ ప్యాకేజీ అందుకుంటున్నారు.