Begin typing your search above and press return to search.

అసలు విషయం ఏంటో చెప్పేసాడు!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:14 AM GMT
అసలు విషయం ఏంటో చెప్పేసాడు!
X

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ రెండు బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు ఏకంగా రెండు సార్లు వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ ని దాటాయి. దీంతో ఒక ఏడాదిలొనే వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ ని రెండు సార్లు అందుకున్న మొదట స్టార్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు.

డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా షారుఖ్ డంకీ సినిమాతో థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఈ ఏడాదిలో షారుఖ్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరణీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విక్కీ కౌశల్, తాప్సి పన్ను మూవీలో ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే సలార్ కి పోటీగా ఈ చిత్రాన్ని షారుఖ్ రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకున్నాయి. రాజ్ కుమార్ గత సినిమాల తరహాలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా కింగ్ షారుఖ్ ఖాన్ అభిమానులతో ట్విట్టర్ ఎక్స్ లో ముచ్చటించారు. ఈ సందర్భంగా డంకీ టైటిల్ కి మీనింగ్ తెలియజేశారు.

డంకీ అంటే పంజాబీ స్టైల్ లో అనుమతులు లేకుండా సరిహద్దులు దాటడం అనే మీనింగ్ వస్తుంది. గాడిద ప్రయాణం అని కూడా అంటారు అని పేర్కొన్నారు. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ కూడా అదే తరహాలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఫుల్ కామెడీ జెనరేట్ చేస్తూనే ఎమోషనల్ డ్రామాని కూడా ట్రైలర్ లో రాజ్ కుమార్ హిరాణీ ఆవిష్కరించారు.

ఈ సినిమాతో మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ని అందుకోవాలని షారుఖ్ చూస్తున్నారు. అయితే కేవలం హిందీలో మాత్రమే మూవీ రిలీజ్ అవుతోంది. దానికి తోడు మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీ సలార్ కి పోటీగా ఈ చిత్రం వస్తోంది. మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ఉన్నా కూడా డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమా రిజల్ట్ మీద డంకీ కలెక్షన్స్ ఆధారపడి ఉండే అవకాశం ఉంది.