Begin typing your search above and press return to search.

డుంకీతో జాక్ పాట్ కొడతారా?

షారుఖ్ ఖాన్, తాప్సీ లీడ్ రోల్ లో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతోన్న సినిమా డుంకీ

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:30 AM GMT
డుంకీతో జాక్ పాట్ కొడతారా?
X

షారుఖ్ ఖాన్, తాప్సీ లీడ్ రోల్ లో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతోన్న సినిమా డుంకీ. డిసెంబర్ 21న ఈ మూవీ థియేటర్స్ లోకి అడుగుపెడుతోంది. సలార్ కి పోటీగా వస్తోన్న కూడా నిర్మాతలు ఎలాంటి టెన్షన్ లేకుండా మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. దీనికి కారణం షారుఖ్ ఇమేజ్, మార్కెట్ మీద ఉన్న నమ్మకమని చెప్పాలి.

బాలీవుడ్ లోకి వెళ్ళిన చాలా రోజులకి తాప్సికి ఒక పెద్ద సినిమాలో నటించే అవకాశం డుంకీతో వచ్చింది. ఇందులో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలోనే ఆమె కనిపిస్తోంది. రాజ్ కుమార్ హిరాణీ సినిమాలు అంటే యాక్షన్ ఎలిమెంట్స్ అస్సలు ఎక్స్ పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బలమైన కథ, కథనం, మానవ సంబంధాలు, సోషల్ సెటైరికల్ ఎక్కువగా ఉంటాయి.

డుంకీలో కూడా అలాంటి అంశాలని రాజ్ కుమార్ హిరాణీ టచ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కూడా రాజ్ కుమార్, షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ కాకుండా వంద కోట్లలోనే అయ్యిందంట. అంతే తక్కువ బడ్జెట్ లో మూవీ పూర్తి చేసినట్లే అని చెప్పాలి. అలాగే షూటింగ్ కోసం ఎక్కువ టైం తీసుకోలేదు. ఈ మూవీకి నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే 250 కోట్ల ఆదాయం వచ్చేసిందని బిటౌన్ లో వినిపిస్తోన్న మాట.

ఈ రైట్స్ ద్వారానే సినిమాకి పెట్టిన పెట్టుబడి మెజారిటీ రికవరీ అయిపొయింది. ఇక థీయాట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగే అవకాశం ఉంది. హిందీతో పాటు సౌత్ భాషలలో కూడా రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే అవకాశం ఉంది. ఈ సినిమా హిట్ అయితే షారుఖ్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల కలెక్షన్ మూవీగా మారిపోతుంది. ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తే మాత్రం 600 కోట్లకి పైగా షేర్ అందుకునే ఛాన్స్ ఉందని టాక్.

నిర్మాతకి అయితే ఈ మూవీ భారీ లాభాలు తెచ్చిపెడుతుందని, షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబో కచ్చితంగా ఈ ఏడాదిలో డుంకీతో జాప్ పాట్ కొత్తబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. పాజిటివ్ టాక్ వచ్చిన కూడా సలార్ మూవీ టాక్ కూడా డుంకీ కలెక్షన్స్ ని డిసైడ్ చేసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం.