Begin typing your search above and press return to search.

షారుఖ్ లిస్టులో మరో తమిళ్ డైరెక్టర్?

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన ఇమేజ్ ని సౌత్ లో కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Sep 2023 4:33 AM GMT
షారుఖ్ లిస్టులో మరో తమిళ్ డైరెక్టర్?
X

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన ఇమేజ్ ని సౌత్ లో కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా సౌత్ దర్శకులతో మూవీస్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా అత్లీ దర్శకత్వంలో చేసిన జవాన్ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ఇప్పటికే ఓవర్సీస్ లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పఠాన్ తర్వాత భారీ అంచనాల మధ్య జవాన్ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది.

షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ లోనే ఈ మూవీ తెరకెక్కడం విశేషం. కచ్చితంగా జవాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ తన ఖాతాలో వేసుకుంటారని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే మరో తమిళ్ దర్శకుడితో షారుఖ్ ఖాన్ సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. కోలీవుడ్ లో పాన్ ఇండియా ఇమేజ్ దిశగా అడుగులు వేస్తున్న వ్యక్తి లోకేష్ కనగరాజ్

వరుస సక్సెస్ లతో దూకుడు మీదున్న లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మాఫియా బ్యాక్ డ్రాప్ కథలని స్టార్ హీరోలతో చేస్తున్నాడు. ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన లియో మూవీ దసరాకి రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తరువాత ప్రభాస్ తో కూడా లోకేష్ మూవీ ప్లాన్ చేశాడు. దానికంటే ముందుగా రజినీకాంత్ తో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్తారు.

షారుఖ్ ఖాన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మూవీస్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ కోలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. లోకేష్ చేస్తోన్న సినిమాటిక్ యూనివర్స్ లో ఒక ప్రాజెక్ట్ షారుఖ్ తో చేయనున్నాడంట. ప్రస్తుతం దీనికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయంట.

జవాన్ సక్సెస్ అయితే షారుఖ్ ఖాన్ ఇంకా ఎక్కువ మంది సౌత్ దర్శకులతో మూవీస్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ సర్కిల్ లో కూడా వినిపిస్తోంది. ఒక వేళ లోకేష్ కనగరాజ్, షారుఖ్ కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే మాత్రం కచ్చితంగా ఆ మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.