Begin typing your search above and press return to search.

అజిత్ ని షారుక్ ఇప్పుడెందుకు లైట్ తీసుకున్న‌ట్లు?

'జ‌వాన్' రిలీజ్ లో భాగంగా బాద్ షా షారుక్ ఖాన్ కోలీవుడ్ న‌టుల్ని చుట్టేస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Sep 2023 3:00 AM GMT
అజిత్ ని షారుక్ ఇప్పుడెందుకు లైట్ తీసుకున్న‌ట్లు?
X

'జ‌వాన్' రిలీజ్ లో భాగంగా బాద్ షా షారుక్ ఖాన్ కోలీవుడ్ న‌టుల్ని చుట్టేస్తోన్న సంగ‌తి తెలిసిందే. చెన్నై లో భారీ ఎత్తున ఈవెంట్ నిర్వ‌హించి సగం స‌క్సెస్ అయ్యారు. బ్యాకెండ్ లో ర‌జ‌నీకాంత్..క‌మ‌ల్ హాస‌న్..విజ‌య్ లాంటి వారి స‌హ‌కారం ఉండ‌టంతో జ‌వాన్ కి అక్క‌డా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా తొలి రోజు 100 కోట్లు వ‌సూళ్లు సాధిస్తుంద‌ని అంచ‌నాలున్నాయి. పైగా అట్లీకి ఇంత‌వ‌ర‌కూ వైఫ‌ల్యం లేదు.

ఇలా కొన్ని లెక్క‌లు సినిమాపై అంచ‌నాలు ఆకాశ‌న్నంటేలా చేస్తున్నాయి. ఇక ప్ర‌చారం లో భాగంగా గ‌తంలో త‌న‌కి తెలిసిన వారంద‌ర్నీ షారుక్ ఖాన్ క‌లిసారు. అయితే త‌ల అజిత్ ని మాత్రం క‌ల‌వ‌లేదు. ఇదే ప్ర‌శ్న కొంత మంది షారుక్ వ‌ద్ద ప్ర‌స్తావించే స‌రికి స్కిప్ కొట్టాడు. అజిత్ ని క‌ల‌వాలి. మ‌ళ్లీ చెన్నైకి వ‌చ్చిన‌ప్పుడు తప్ప‌కుండా అత‌న్ని క‌లుస్తా? అని అన్నారు. దీంతో ఇదేదో సినిమా రాజ‌కీయంలా ఉందంటూ కోలీవుడ్ మీడియాలో పుకార్లు షురూ అయ్యాయి.

అంత మంది స్టార్ల‌ను క‌లిసి అజిత్ ని క‌ల‌వ‌క‌పోవ‌డం వెనుక నిజంగా స‌మ‌యం లేక‌? క‌ల‌వ‌డం ఇష్టం లేక‌! మ‌రో స్టార్ హీరో ఎవ‌రైనా ఫీల‌వుతార‌ని షారుక్ అలా చేసారా? అంటూ సందేహాలు తెర‌పైకి తెస్తున్నారు. దీని వెనుక ఓ హీరో చ‌క్రం తిప్పిన‌ట్లు అనుమానిస్తున్నారు. అజిత్- విజ‌య్ అభిమానుల మ‌ధ్య వైరం గురించి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఆ ఇద్ద‌రి హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే సీన్ ఎలా ఉంటుందో తెలుసు.

ఆన్ లైన్ లోనూ..ఆఫ్ లైట్ లోనూ గొడ‌వ‌కు దిగ‌డం తెలుసు. ఇలాంటి వివాదం న‌డుమ షారుక్ వెళ్లి అజిత్ ని క‌లిస్తే త‌న సినిమాకే న‌ష్టం అని ఈసారి బాద్ షా కొంద‌ర్ని మాత్ర‌మే క‌లిసిన‌ట్లు చ‌ర్చించుకుం టున్నా రు. అజిత్ ని క‌లిస్తే ఆ హీరో అభిమానులు ఫీల‌వుతున్నారని..ఇది త‌మిళ నాట రిలీజ్ పై ప్ర‌భావం చూపి స్తుందని అందుకే కామ్ గా ఉన్న‌ట్లు గుస గుస‌లాడుకుంటున్నారు.