Begin typing your search above and press return to search.

DDLJ ల‌వ్ .. షారూఖ్‌ - కాజోల్ కెమెరా ట్రిక్ ?

కింగ్ ఖాన్ షారూఖ్ - కాజోల్ జంట గురించి త‌ల‌వ‌గానే తొలిగా గుర్తుకు వచ్చేది DDLJ ప్రేమ‌. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే చిత్రంతో హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది ఈ జంట‌.

By:  Tupaki Desk   |   30 Oct 2023 5:30 AM GMT
DDLJ ల‌వ్ .. షారూఖ్‌ - కాజోల్ కెమెరా ట్రిక్ ?
X

కింగ్ ఖాన్ షారూఖ్ - కాజోల్ జంట గురించి త‌ల‌వ‌గానే తొలిగా గుర్తుకు వచ్చేది DDLJ ప్రేమ‌. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే చిత్రంతో హృద‌యాల్ని కొల్ల‌గొట్టింది ఈ జంట‌. స్వ‌చ్ఛ‌మైన అంద‌మైన ప్రేమికులు ఎలా ఉంటారో ఈ ఇద్ద‌రినీ చూసి యూత్ వోన్ చేసుకుంటారు. ప్రేమ కోసం ఎలాంటి సాహ‌సాలకు అయినా సిద్ధ‌ప‌డే యువ‌కుడిగా, అల్ల‌రి ప్రేమికుడిగా షారూఖ్ ఎంతో అద్భుతంగా న‌టించారు ఈ చిత్రంలో. అత‌డి కోసం ఆత్మ‌త్యాగానికైనా సిద్ధ‌ప‌డే ప్రేమికురాలిగా కాజోల్ ఒదిగిపోయి న‌టించింది. ఎట‌ర్న‌ల్ ల‌వ్ స్టోరికి ఒక ఎగ్జాంపుల్ గా నిలిచిపోయింది డిడిఎల్‌జే.

అందుకే షారూఖ్‌- కాజోల్ జోడీ మ‌ళ్లీ మ‌ళ్లీ క‌లిసి న‌టించాల‌ని అభిమానులు కోరుకుంటారు. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే చిత్రానికి ఆదిత్య చోప్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. డిడిఎల్‌జే తో పాటు ప‌లు చిత్రాల్లో షారూఖ్- కాజోల్ జంట న‌టించారు. అవ‌న్నీ అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ గా మారాయి.

అదంతా అటుంచితే ఇప్పుడు షారూఖ్ - కాజోల్ జంట సాన్నిహిత్యానికి సంబంధించిన ఒక త్రోబ్యాక్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోగ్రాఫ్‌లో షారూఖ్‌- కాజోల్ ఘాడ‌మైన‌ పెద‌వి చుంబ‌నం ఆశ్చ‌ర్య‌పరుస్తోంది. అంద‌మైన జంట‌ త‌న్మ‌యంలో మునిగిపోయి రొమాంటిగ్గా క‌నిపిస్తున్నారు. అయితే ఈ స్టీమీ ఫోటోగ్రాఫ్ ని చూడ‌గానే అభిమానులు ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ఒరిజిన‌ల్ ఫోటోయేనా? కెమెరా ట్రిక్కా లేక మార్ఫింగ్ చేసిన‌దా? ఇది ఎడిటింగ్ మాయాజాలం అనుకోవాలా? అర్థం కావ‌డం లేదు. కానీ ఈ ఫోటోగ్రాఫ్ వాట్సాప్ గ్రూపుల్లో, సోష‌ల్ మీడియాల్లో జోరుగా షికార్ చేస్తోంది.

మ‌రోవైపు డీడీఎల్ జే అభిమానులు మాత్రం ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈ అంద‌మైన జంట తిరిగి క‌లిసి న‌టిస్తే చూడాల‌ని ఉంద‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుత స‌న్నివేశంలో ఖాన్ జోష్ మీదున్నాడు. మ‌రోసారి డిఫ‌రెంట్ గా ల‌వ్ స్టోరీని ఎటెంప్ట్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అందుకే ఈ క్రేజీ పెయిర్ రిపీట్ అయ్యేందుకు ఛాన్స్ లేక‌పోలేదు.

షారూఖ్ -కాజోల్ న‌టించిన‌ సినిమాల జాబితా

నెం- సినిమా పేరు- IMDb రేటింగ్

1. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995) 8

2. కరణ్ అర్జున్ (1995) 6.8

3. కుచ్ కుచ్ హోతా హై (1998) 7.5

4. కభీ ఖుషీ కభీ ఘమ్ (2001) 7.4

5. కల్ హో నా హో (2003) 7.9

6. కభీ అల్విదా నా కెహ్నా (2006) 6

7. ఓం శాంతి ఓం (2007) 6.7

8. నా పేరు ఖాన్ (2010) 7.9

9. దిల్‌వాలే (2015) 5