ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన షారుఖ్
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఫోటోలు, లుక్స్ నెటిజన్స్ ను, ఆయన ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేశాయి.
By: Tupaki Desk | 7 May 2025 12:00 AM ISTప్రపంచ ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈవెంట్ మెట్‌గాలా. ఈ ఈవెంట్ ప్రతీ ఏటా మే నెల మొదటి వారంలో జరుగుతుంది. న్యూయార్క్ లోని మెట్రోపాలిటిన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో ఈ వేడుక జరుగుతుంద. ఆల్రెడీ మెట్‌గాలా ఈవెంట్ ఇవాళ మొదలంది. అయితే ఈ ఈవెంట్ కు ఎవరు పడితే వాళ్లు వెళ్లడానికి లేదు.
ప్రపంచవ్యప్తంగా ఎంతో పేరున్న అతికొద్ది మంది మాత్రమే ఈ ఈవెంట్ కు వెళ్లగలరు. అయితే ఈ సారి ఇండియా నుంచి బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, కియారా అద్వాణీ, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్, నటాషా పూనావా, సింగర్ దిల్జిజ్ దోసాంజ్ తో పాటూ ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ కూడా హాజరై రెడ్ కార్పెట్ పై సందడి చేశారు.
ఈ రెడ్ కార్పెట్ లో ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ స్టైల్ లో కనిపించగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఫోటోలు, లుక్స్ నెటిజన్స్ ను, ఆయన ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేశాయి. దానికి మొదటి కారణం మెట్‌గాలా ఈవెంట్ లో పాల్గొన్న షారుఖ్ ఫోటోలను ఆయన కాకుండా అతని మేనేజర్ పూజా దదలానీ షేర్ చేయడం కాగా, రెండోది ఆయన లుక్స్.
మెట్‌గాలా లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, అతని అకౌంట్ నుంచి కాకుండా పూజా అకౌంట్ నుంచి షేర్ చేయడమేంటని షారుఖ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే దానికి కారణం లేకపోలేదు. మెట్‌గాలా ఈవెంట్ కు వెళ్లేటప్పుడు ఆ ఈవెంట్ లో ఎంతటి పెద్ద సెలబ్రిటీ అయినా ఫోన్ బయటే పెట్టి వెళ్లాలి. ఈ కారణంతోనే షారుఖ్ మెట్‌గాలా రెడ్ కార్పెట్ ఫోటోలను ఆయన మేనేజర్ తన అకౌంట్ నుంచి షేర్ చేయాల్సి వచ్చింది.
ఇక రెండోది షారుఖ్ లుక్స్. ఈ ఈవెంట్ లో ఆయన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. బ్లాక్ డ్రెస్ లో లేయర్డ్ నగలు ధరించి, చేతిలో కర్ర, కళ్లకు గాగుల్స్ తో షారుఖ్ లుక్ చాలా కొత్తగా ఉన్నప్పటికీ ఆ లుక్ ఆయన ఫ్యాన్స్ కు కూడా పెద్దగా నచ్చలేదు. ఈ లుక్ చూడ్డానికా మేం వేకువఝామున 3.30 గంటల వరకు మేల్కొని ఉన్నామంటూ ఆ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ పెదవి విరుస్తున్నారు. మొత్తానికి మెట్‌గాలా ఈవెంట్ లో షారుఖ్ లుక్స్ అతని ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ పరిచాయి.
