మొత్తానికి 'కింగ్' అలా తేలిందన్న మాట!
బాద్ షా షారుక్ ఖాన్ తనయురాలు సుహానాఖాన్ లాంచింగ్ మూవీ 'కింగ్' బాలీవుడ్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలిసిందే.
By: Tupaki Desk | 13 May 2025 3:30 PMబాద్ షా షారుక్ ఖాన్ తనయురాలు సుహానాఖాన్ లాంచింగ్ మూవీ 'కింగ్' బాలీవుడ్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో తెలిసిందే. కుమార్తె కోసం షారుక్ తన ఇమేజ్ ని పక్కనబెట్టి మరీ గెస్ట్ రోల్ పోషిస్తున్నట్లు ప్రచారం జరిగింది. సుహానా పాత్ర మాత్రమే ప్రధానంగా హైలైట్ అవుతుందని మీడియా కోడై కూసింది. కానీ అసలు సంగతేంటి? అంటే ఇందులో హీరో షారుక్ ఖాన్ అని తేలింది.
షారుక్ మెయిన్ లీడ్ లో సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో షారుక్ ఖాన్ కి జోడీగా దీపికా పదుకొణే నటిస్తుంది. అభిషేక్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా షారుక్ గురువు పాత్ర కోసం అనీల్ కపూర్ ని రంగంలోకి దించుతున్నారు. మేకర్స్ అనీల్ కపూర్ తో సంప్రదింపులు జరుపు తున్నారు. సినిమాలో ఈ పాత్ర హీరో తర్వాత ప్రముఖంగా హైలైట్ అవుతుందట. తొలుత అమితాబచ్చన్ ని రంగంలోకి దించాలనుకున్నారట.
కానీ ఆయన కన్నా అనీల్ కపూర్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని బంతి ఇటివైపు మళ్లినట్లు మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారని సమాచారం.
'డంకీ' తర్వాత షారుక్ హీరోగా నటించే సినిమా ఏంటని? ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్రేక్షకులు కింగ్ విషయంలో ఫిక్సై పోవొచ్చు. అయితే ఇందులో సుహానాఖాన్ పాత్ర ఎలా ఉండబోతుంది? అన్నది చూడాలి. సినిమాలో సుహానా కేవలం కీలక పాత్రధారిగానే కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.