Begin typing your search above and press return to search.

కింగ్ ఖాన్ కి ఆమే క్వీన్..!

ఐతే ఈ కింగ్ సినిమాలో షారుఖ్ సరసన స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె నటిస్తుంది. షారుఖ్ దీపిక జోడీ అంటేనే సూపర్ హిట్.

By:  Tupaki Desk   |   1 May 2025 9:55 PM IST
కింగ్ ఖాన్ కి ఆమే క్వీన్..!
X

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేక కెరీర్ లో వెనకపడ్డాడు. కానీ పఠాన్ సినిమాతో ఆయన కోరిన సక్సెస్ వచ్చింది. ఆ వెంటనే జవాన్, డుంకీ ఇలా వరుస హిట్లు షారుఖ్ ని మళ్లీ స్టార్ లీగ్ లోకి తెచ్చేలా చేశాయి. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వొచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్టుగా ఫాం లోకి లేట్ అవ్వొచ్చేమో కానీ ఆ ఫాం ఎప్పొడొచ్చినా దాన్ని కొనసాగించడం పక్కా అని షారుఖ్ ని చూస్తే తెలుస్తుంది.

డుంకీ తర్వాత కొద్దిగా రిలాక్స్ అయిన షారుఖ్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను షారుఖ్ కూతురు సుహానా ఖాన్ నిర్మిస్తుంది. బాలీవుడ్ లో యాక్షన్ సినిమాల డైరెక్టర్ గా సిద్ధార్థ్ ఆనంద్ కి మంచి క్రేజ్ ఉంది. అందులో భాగంగా షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాను కూడా అదే రేంజ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

ఐతే ఈ కింగ్ సినిమాలో షారుఖ్ సరసన స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె నటిస్తుంది. షారుఖ్ దీపిక జోడీ అంటేనే సూపర్ హిట్. ఓం శాంతి ఓం నుంచి జవాన్ వరకు ఈ ఇద్దరు కలిసి నటిస్తే చాలు సూపర్ హిట్ అన్నట్టే లెక్క. ఆల్రెడీ షారుఖ్ దీపికా కలిసి ఇప్పటికే ఐదు సినిమాల్లో నటించారు. ఇప్పుడు కింగ్ సినిమాకు కూడా క్వీన్ గా అదే హీరోయిన్ గా దీపికానే నటిస్తుంది.

దీపిక కూడా స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ ఫెయిర్ గా తన ఫాం కొనసాగిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అమ్మడు తన సత్తా చాటుతుంది. కల్కి 2898 ADతో సౌత్ లో కూడా సూపర్ అనిపించుకుంది దీపికా పదుకొనె. కింగ్ సినిమాలో దీపిక నటించడం ఆ సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి దీపిక హిట్ సెంటిమెంట్ షారుఖ్ కింగ్ కి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.

బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతున్న ఈ టైం లో షారుఖ్ ఖాన్ మాత్రం తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. కింగ్ తో అది సాధ్యమవుతుందో లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.