ఆయన కోసం స్టార్ హీరో అతిధిగానా?
బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ 'డాన్' సిరీస్ నుంచి 'డాన్ 3'కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఈసారి 'డాన్' గా రణవీర్ సింగ్ బరిలోకి దిగుతున్నాడు.
By: Tupaki Desk | 9 July 2025 1:00 AM ISTబాలీవుడ్ హిట్ ప్రాంచైజీ 'డాన్' సిరీస్ నుంచి 'డాన్ 3'కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఈసారి 'డాన్' గా రణవీర్ సింగ్ బరిలోకి దిగుతున్నాడు. కొన్ని నెలలుగా పర్హాన్ అక్తర్ ఈ ప్రాజెక్ట్ పైనే పని చేస్తున్నాడు. గత రెండు భాగాలను మించి నెక్స్ట్ లెవల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేసి పనిచేస్తున్నాడు. స్క్రిప్ట్ పర్పెక్షన్ కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టారు. దీనిలో భాగంగా హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది.
తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో గెస్ట్ పాత్రలో షారుక్ ఖాన్ కనిపించనున్నారట. ఆ పాత్ర ఆయనే పోషించాలని షారుక్ ని పర్హాన్ ని రిక్వెస్ట్ చేసాడు. దీంతో పర్హాన్ మాట కాదనలేక షారుక్ కూడా అంగీకరించినట్లు సమాచారం. 'డాన్' ప్రాంచైజీని పర్హాన్ అక్తర్ తెరపైకి తెచ్చిందే షారుక్ ఖాన్ తో. డాన్, డాన్ 2 చిత్రాల్లో హీరోగా షారుక్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. డాన్ పాత్రలో షారుక్ అభినయంతో ఆ ప్రాంచైజీకి వన్నే తీసుకొచ్చారు.
ఆ తరహా పాత్రలు పోషిచాలంటే షారుక్ మాత్రమే పోషించాలని ఓ ముద్ర వేసేసారు. దీంతో 'డాన్ 3'ని కూడా షారుక్ తోనే తె రకెక్కిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ పర్హాన్ మాత్రం మూడవ భాగంలో కొత్త హీరోని చూడాలనుకున్నాడు. దీనిలో భాగంగా షారుక్ ప్లేస్ ని రణవీర్ సింగ్ తో రీప్లేస్ చేసాడు. డాన్ పాత్రకు రణవీర్ కూడా పక్కాగా సూటయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ టీజర్ కూడా ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఇప్పటికే మొదలవ్వాలి. కానీ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడుతుంది. అన్ని పను లు పూర్తి చేసి జనవరిలోప్రారంభిచాలని సన్నాహాలు చేస్తున్నారు. హీరోయిన్ పాత్రకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కి కూడా స్టోరీ నేరేట్ చేసినట్లు ప్రచారంలోకి వచ్చింది. కానీ ఆమె నుంచి ఇంకా ఇలాంటి సమాధానం రాలేదు.
