Begin typing your search above and press return to search.

వేదిక‌పై దేవ‌ర‌కొండ‌ను కిస్ చేసిన షాహిద్

షాహిద్ త‌న‌కంటే చాలా జూనియ‌ర్ అయిన‌ విజయ్ చేతులు, తలపై నిమురుతూ ఎంతో ప్రేమ‌ను కురిపించ‌డం అహూతుల‌ను ఆక‌ట్టుకుంది.

By:  Tupaki Desk   |   20 March 2024 11:51 AM GMT
వేదిక‌పై దేవ‌ర‌కొండ‌ను కిస్ చేసిన షాహిద్
X

'అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్` 2019లో బాలీవుడ్‌లో అతిపెద్ద బ్లాక్ బస్టర్లలో ఒకటి. ఇందులో విజయ్ దేవరకొండ- షాలిని పాండే జంట‌గా నటించారు. ఈరోజు ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ వీడియో 2024 టైటిల్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్‌కు విజయ్- షాహిద్ హాజరయ్యారు. ప్ర‌తిష్ఠాత్మ‌క కార్య‌క్రమంలో అర్జున్ రెడ్డి ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క‌బీర్ సింగ్ ఫేం షాహిద్ మ‌ధ్య కెమిస్ట్రీ ఆద్యంతం అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. అంతేకాదు ఈ వేదిక‌పై బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ అర్జున్ రెడ్డిగా న‌టించిన‌ విజయ్ దేవ‌ర‌కొండ‌పై త‌న ప్రేమ‌ను కురిపించారు. అత‌డి న‌ట‌న‌ను ప్రశంసించారు.

షాహిద్ త‌న‌కంటే చాలా జూనియ‌ర్ అయిన‌ విజయ్ చేతులు, తలపై నిమురుతూ ఎంతో ప్రేమ‌ను కురిపించ‌డం అహూతుల‌ను ఆక‌ట్టుకుంది. ``నేను అతనికి చాలా ప్రేమను ఇవ్వాలి. నా అర్జున్ రెడ్డి బనీ హోతీ, నా కబీర్ సింగ్ పైడా హోతా. ధన్యవాదాలు, విజయ్!`` అంటూ విజయ్‌ని హ‌గ్ చేసుకుని, కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా అత‌డి బుగ్గపై ప్రేమ‌గా ముద్దు కూడా పెట్టాడు.

అర్జున్ రెడ్డి గురించి మా అందరికీ తెలుసు.. నేను మిమ్మల్ని ఒక సాధారణ ప్రశ్న అడగాలనుకుంటున్నాను.. ``అర్జున్ రెడ్డి ఫ్యామిలీ హీరోగా ఎలా మారాడు?``అని షాహిద్ ప్ర‌శ్నించాడు. దీనికి విజయ్ ఏమ‌న్నాడు అంటే.. తన నిర్మాత వైపు చూస్తూ, ``నాలో అలా వచ్చేశాడు అంతే! నాకు స్క్రిప్ట్ నచ్చడంతో ఈ సినిమాను ఎంచుకున్నాను`` అన్నాడు.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో షాహిద్ కపూర్ మాట్లాడుతూ.. మొదట కబీర్ సింగ్‌గా నటించాలనే అభిప్రాయం తనకు లేదని గుర్తుచేసుకున్నాడు. ఇది (కబీర్ సింగ్) రీమేక్ కాబట్టి నేను అర్జున్ రెడ్డిని చూశాను. ఎవరో మా ఇంటికి డీవీడీ పంపారు. నేను - మీరా (భార్య‌) కూర్చుని సినిమా చూసాం. నేను సినిమా చూశాను.. ఇది చాలా కూల్ సినిమా.. మనిషి చేయ‌కూడనిదంతా ఈ సినిమాలో చేసాడు అత‌డు. ఇప్పటికీ నేను ఈ వ్యక్తి(అర్జున్‌రెడ్డి)ని ప్రేమిస్తున్నాను. ఒక మంచి వ్యక్తి చేయకూడని ప్రతిదాన్ని అతడు చేస్తున్నాడు. ఇది చాలా బాగుంది.. ఈ వ్యక్తి (అర్జున్ రెడ్డి) ఇలా ఎలా ఉన్నాడు? అని అనుకున్నాను.. అంటూ షాహిద్ ఎగ్జ‌యిట్ మెంట్ ని ప్ర‌ద‌ర్శించాడు. నిజానికి షాహిద్ అర్జున్ రెడ్డి పాత్ర‌ను ఎంత‌గా ప్రేమించాడో అత‌డి మాట‌లు చేష్ట‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ప‌బ్లిక్ వేదిక‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ప్రేమ‌ను కురిపిస్తూ ముద్దు కూడా పెట్టుకున్నాడు. అంత‌గా ఆ పాత్ర‌ను అభిమానించి ప్రేమించాడ‌ని దీనిని బ‌ట్టి అర్థమైంది. సందీప్ వంగా `అర్జున్ రెడ్డి` సీక్వెల్ ని తెర‌కెక్కంచే ఆలోచ‌న ఉంటే బ‌హుశా షాహిద్ దానికోసం వేచి చూస్తాడు అన‌డంలో సందేహం లేదు.