Begin typing your search above and press return to search.

ఇష్టం లేకుండా చేసినా ఎవర్ గ్రీన్ హిట్ కొట్టారు..!

రీసెంట్ ఇంటర్వ్యూ లో కూడా ఇంతియాజ్ అలీ జబ్ వుయ్ మెట్ సీక్వెల్ ఉంటుందని అన్నారు. అయితే ఈ సీక్వెల్ లో షాహిద్ కపూర్ నటిస్తాడా.. అతను చేసినా కరీనా నటించే ఛాన్స్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   2 April 2024 6:49 AM GMT
ఇష్టం లేకుండా చేసినా ఎవర్ గ్రీన్ హిట్ కొట్టారు..!
X

బాలీవుడ్ క్రేజీ కపుల్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ జబ్ వుయ్ మెట్. ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2007 లో రిలీజై సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత అలాంటి ప్రేమ కథలు ఎన్నో వచ్చాయి. సౌత్ లో కూడా జబ్ వుయ్ మెట్ తరహా సినిమాలు తీశారు. ఆ సినిమా టైం లోనే షాహిద్, కరీనా కపూర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అయితే ఆ సినిమా రిలీజ్ కు ముందే ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు.

సినిమా హిట్టైన తర్వాత వారిద్దరి సెపరేషన్ గురించి న్యూస్ వైరల్ అయ్యింది. అయితే ఈ సినిమాను ముందు ఇంతియాజ్ అలీ షాహిద్, కరీనాలతో కాకుండా బాబీ డియో, ప్రీతి జింటాతో తీయాలని అనుకున్నారట. కానీ ప్రీతి జింటా కాదనడంతో బాబీ కూడా ఆసక్తి చూపించలేదట. అయితే షాహిద్ కపూర్ కి కథ వినిపించగా అతనికి నచ్చి ఈ సినిమా ఓకే చేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లోకి కరీనా కపూర్ రావడం కూడా షాహిద్ ప్రోత్సాహమే అని తెలుస్తుంది. కరీనాని ఒప్పించి ఈ సినిమా చేశాడట షాహిద్ కపూర్.

అలా బాబీ డియో, ప్రీతి జింటా చేయాల్సిన జబ్ వుయ్ మెట్ కాస్త షాహిద్ కపూర్, కరీనా కపూర్ ల జంటగా చేశారు. అయితే ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ కొన్నాళ్లుగా చర్చల్లో ఉంటూ వస్తుంది. రీసెంట్ ఇంటర్వ్యూ లో కూడా ఇంతియాజ్ అలీ జబ్ వుయ్ మెట్ సీక్వెల్ ఉంటుందని అన్నారు. అయితే ఈ సీక్వెల్ లో షాహిద్ కపూర్ నటిస్తాడా.. అతను చేసినా కరీనా నటించే ఛాన్స్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

ఒకవేళ వేరే కాస్టింగ్ తో జబ్ వుయ్ మెట్ సీక్వెల్ చేసినా షాహిద్, కరీనాల కేమియో ఉండేలా చూస్తే సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. జబ్ వుయ్ మెట్ సినిమా లవర్స్ అంతా కూడా ఆ సినిమా సీక్వెల్ అని తెలియగానే సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇంతియాజ్ అలి ఈ సినిమా సీక్వెల్ ఎలా ప్లాన్ చేస్తున్నారో కానీ అది జరిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని చెప్పొచ్చు.