ఛత్రపతి శివాజి బయోపిక్.. ఎందుకు ఆగింది..?
అందుకే ఛత్రపతి శివాజి బయోపిక్ సినిమాను ఆపేస్తున్నట్టు వెల్లడించారు అమిత్ రయ్.
By: Tupaki Desk | 25 July 2025 3:00 AM ISTఈమధ్య తెర మీద హిస్టారికల్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మన చరిత్ర.. మన వైభవం.. మన సంస్కృతి గురించి సినిమాల ద్వారా చెబితే నెక్స్ట్ జనరేషన్ ప్రజలకు ఈజీగా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో కూడా ఇలాంటి సినిమాలు చేస్తారు. ఐతే అలా అనుకునే ఈమధ్య చాలా సినిమాలు తెరకెక్కించారు. శంబాజీ మహారాజ్ కథతో ఛావా తీసి సూపర్ హిట్ కొట్టారు. ఐతే ఇదే క్రమంలో షాహిద్ కపూర్ తో శివాజి మహారాజ్ కథ చేయాలని అనుకున్నారు డైరెక్టర్ అమిత్ రాయ్.
సినిమా మేకింగ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. ఐతే హిస్టారికల్ సినిమాలు చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. డీటైలింగ్, రీసెర్చ్ ఇలా ప్రతి ఒక్క విషయంపై పూర్తిస్థాయిలో చర్చలు జరగాలి. దాని నుంచి కథ రెడీ చేయాలి. ఎలా పడితే అలా చరిత్ర తీస్తానంటే కుదరదు.
ఐతే అమిత్ రాయ్ తను శివాజి కథతో సినిమా చేస్తానంటే తనకు సపోర్ట్ రావట్లేదని అంటున్నాడు అమిత్ రాయ్. అందుకే ఛత్రపతి శివాజి బయోపిక్ సినిమాను ఆపేస్తున్నట్టు వెల్లడించారు అమిత్ రయ్. 180 కోట్ల బడ్జెట్ తో OMG 2 సినిమా తీసిన తనకు ఛత్రపతి శివాజి చరిత్ర తెరకెక్కించే కేపబిలిటీ లేదా అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో ఫ్రస్ట్రేట్ అయ్యారు.
చరిత్ర కథలు తాను ఒక్కడే అనుకుంటే సరిపోదు. దానికి చాలా కండీషన్స్ ఉంటాయి. ఆ విషయంలో అమిత్ రాయ్ కి లక్ కలిసి రాలేదు. షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ఇలా భారీ స్టార్ కాస్ట్ తో ఛత్రపతి బయోపిక్ ప్లాన్ చేశారు అమిత్ రాయ్. కానీ ఆ సినిమా చేయడానికి తనకు ఛాన్స్ లేదని వెల్లడించాడు.
షాహిద్ కపూర్ కూడా ఈమధ్య వరుస ఫ్లాపులతో మళ్లీ ట్రాక్ తప్పుతున్నాడు. కబీర్ సింగ్ తర్వాత అతనికి హిట్టు పడలేదు. రీసెంట్ గా వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. ఐతే ఈసారి షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ దురంధర్ తో పోటీ పడుతున్నాడు. ఆ సినిమాలు డిసెంబర్ ఫస్ట్ వీక్ రిలీజ్ అవుతున్నాయి. షాహిద్ కపూర్ కి శివాజి బయోపిక్ పడి ఉంటే మాత్రం కచ్చితంగా మళ్లీ ట్రాక్ లోకి వచ్చే వాడు. ఐతే అమిత్ రాయ్ తో మిస్ అయిన ఈ బయోపిక్ ఎవరు చేస్తారు.. ఎవరితో చేస్తారన్నది తెలియాల్సి ఉంది.
