పరాజయాల పాఠం.. స్క్రిప్ట్ ఎంపికలో సరికొత్త వ్యూహం!
పరిశ్రమలో ఒక నటుడు ఎంత సుదీర్ఘకాలం కొనసాగినా? బాక్స్ ఆఫీస్ ఫలితాలను ముందే ఊహించడం సాధ్యం కాదు.
By: Srikanth Kontham | 13 Jun 2026 12:00 AM ISTపరిశ్రమలో ఒక నటుడు ఎంత సుదీర్ఘకాలం కొనసాగినా? బాక్స్ ఆఫీస్ ఫలితాలను ముందే ఊహించడం సాధ్యం కాదు. ఒక్కోసారి వరుస విజయాలు అందించిన నమ్మకమే తదుపరి చిత్రాల పరాజయాలకు దారి తీయోచ్చు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత చిత్రాల బాక్స్ ఆఫీస్ ఫలితాలను విశ్లేషించుకున్న షాహిద్ కథల ఎంపిక విషయంలో దశాబ్దాలుగా పాటిస్తున్న ఓ కీలకమైన అలవాటును మార్చుకున్నట్లు వెల్లడించారు. ఆ మధ్య విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ 'దేవా'.. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన రోమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ రోమియో 'చిత్రాలు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినా? బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి.
ఈ రెండు చిత్రాల వైఫల్యాలు ఆలోచనలో పడేసాయని షాహిద్ కపూర్ ఒప్పుకున్నారు. కెమెరా ముందు నటుడిగా ఎలా ప్రవర్తించాలో? ఏ రకమైన హావభావాలు పలికించాలో? తనకు సంపూర్ణంగా తెలుసని.. కానీ ఏ కథలను ఎంచుకోవాలో అనే విషయంలో జడ్జిమెంట్ ఎక్కడో తప్పుతోందని గ్రహించారు. ఈ పరాజయాల నేపథ్యంలో షాహిద్ కపూర్ కథల ఎంపిక ప్రక్రియలో పెద్ద మార్పు తీసుకొచ్చారు. గతంలో దర్శకులు చెప్పే కథ వినిపించే కార్యక్రమాల్లో ఒంటరిగా మాత్రమే కూర్చునే అలవాటు ఉన్న షాహిద్.. ఇకపై ఆ పద్ధతికి స్వస్తి పలికారు.
ఇకపై దర్శకుడు కథ చెప్తున్నప్పుడు తనతో పాటు మరో ముగ్గురు టీమ్ సభ్యులు ఆ గదిలో ఉండేలా షాహిద్ కపూర్ నిబంధన పెట్టుకున్నారు. తాను ఒంటరిగా కథ విన్న ప్పుడు తన వ్యక్తిగత ఊహలకు, కళాత్మక ఆలోచనలకే పరిమితం అవుతున్నానని వివరించారు. తన అంతర్గత కళాత్మక దృష్టి ఒక్కోసారి వాణిజ్యపరంగా వర్కవుట్ కాకపోవచ్చని అందుకే అన్నీ కోణాల్లో అభిప్రాయాలు సేకరిం చడం అవసరమని షాహిద్ భావిస్తున్నారు. తనతో పాటు ఉండే ఇతర టీమ్ సభ్యుల అభిప్రాయాలు సినిమాను ప్రేక్షకుల కోణంలో విశ్లేషించడానికి సహాయ పడతాయని నమ్ముతున్నారు.
ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉన్నా? ఎన్ని ఏళ్లుగా పనిచేస్తున్నా? కథల ఎంపికలో తప్పులు జరగడం సహజమని.. చలనచిత్ర రంగం అత్యంత అనూహ్యమైనదని పేర్కొన్నారు. ఒక అగ్ర నటుడు తన కెరీర్‌లో పరాజయాలు ఎదురైనప్పుడు అహంభావానికి పోకుండా, తన తప్పులను బహిరంగంగా అంగీకరించి పనితీరును మార్చుకోవడం ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరుగుతుంది. ఎప్పుడూ నమ్మకంగా కనిపించడమే కాదు. అవసరమైనప్పుడు వినమ్రంగా ఉంటూ మార్పులను ఆహ్వానించాలి అని షాహిద్ కపూర్ మాటలు ఆయన పరిణతిని తెలియజేస్తున్నాయి.
ప్రస్తుతం షాహిద్ కపూర్ `కాక్‌టెయిల్ 2` ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. హోమి అదజానియా దర్శకత్వంలో లవ్ ట్రయాంగిల్ కథాంశంతో తెరకెక్కుతున్న క్రేజీ సీక్వెల్‌లో కృతి సనన్, రష్మిక మందన్న కథానాయికలుగా నటి స్తున్నారు. ఈ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ద్వారా షాహిద్ ప మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశిస్తున్నారు
