45 కోట్ల రేంజుకు స్టార్ హీరో పారితోషికం!
ఇటీవల ఫర్జీ 2 స్క్రిప్టింగ్ దశలో ఉందని రాశీ ఖన్నా ధృవీకరించింది. తాజా సమాచారం మేరకు ఫర్జీ 2 కోసం షాహిద్ తన కెరీర్ బెస్ట్ పారితోషికం అందుకోబోతున్నాడని తెలిసింది.
By: Tupaki Desk | 11 May 2025 4:27 AMతెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డికె నిర్మించిన బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ `ఫర్జీ`తో షాహిద్ కపూర్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ సిరీస్‌లో విజయ్ సేతుపతి, కే కే మీనన్, రాశి ఖన్నా, భువన్ అరోరా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సరైన అవకాశాల్లేక నిరాశ చెందిన కళాకారుడి కథతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఫేక్ కరెన్సీ తయారు చేసే క్రిమినల్ గా ఈ నటుడు మారాక ఏం జరిగిందనేది ఓటీటీ తెరపై చూడాలి.
ఇటీవల ఫర్జీ 2 స్క్రిప్టింగ్ దశలో ఉందని రాశీ ఖన్నా ధృవీకరించింది. తాజా సమాచారం మేరకు ఫర్జీ 2 కోసం షాహిద్ తన కెరీర్ బెస్ట్ పారితోషికం అందుకోబోతున్నాడని తెలిసింది. రెండో సీజన్ కోసం అతడు తన పారితోషికాన్ని భారీగా పెంచాడు. షాహిద్ స్వతహాగా 30కోట్ల వరకూ వసూలు చేస్తాడు. కానీ ఫర్జీ సీజన్ 2 కోసం దాదాపు రూ. 45 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఖాన్ లు 100కోట్లు అందుకుంటున్నారు. ఆ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే బాలీవుడ్ నటులలో ఒకడిగా షాహిద్ స్థిరపడుతున్నాడు. అతడు సాధారణంగా ఒక చిత్రానికి రూ. 25-30 కోట్లు వసూలు చేస్తాడు. కానీ ఇప్పుడు 15 కోట్లు అదనంగా ఫీజును పెంచాడు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. షాహిద్ కపూర్ చివరిగా దేవాలో కనిపించాడు. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో చక్కని ఆదరణ పొందింది. ఇందులో షాహిద్ మాస్ పోలీస్ గా నటించాడు. ఒక కేసులో చిక్కుకున్న ధైర్యవంతుడైన పోలీసు అధికారి గా నటించాడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రను పోషించింది. విశాల్ భరద్వాజ్ తదుపరి యాక్షన్ థ్రిల్లర్‌లోను షాహిద్ నటించనున్నాడు.