Begin typing your search above and press return to search.

బ్రాడ్ పిట్ -జాకీ చాన్ ల‌ను వెన‌క్కి నెట్టిన షారూఖ్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించే హీరోలుగా ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గ‌ర్, డ్వేన్ జాన్స‌న్, టామ్ క్రూజ్, జార్జ్ క్లూనీ, బ్రాడ్ ఫిట్, జాకీ చాన్ వంటి న‌టుల గురించి చెప్పుకుంటాం.

By:  Tupaki Desk   |   2 May 2025 9:55 AM IST
Shah Rukh Khan Enters Top 3 Richest Actors in the World
X

ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించే హీరోలుగా ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గ‌ర్, డ్వేన్ జాన్స‌న్, టామ్ క్రూజ్, జార్జ్ క్లూనీ, బ్రాడ్ ఫిట్, జాకీ చాన్ వంటి న‌టుల గురించి చెప్పుకుంటాం. కానీ ఈ జాబితాలో ప‌లువురు దిగ్గ‌జాల్ని వెన‌క్కి నెట్టి భార‌తీయ సూప‌ర్ స్టార్ షారూఖ్ ఖాన్ సంప‌న్నుడిగా రికార్డుల‌కెక్కారు. అత‌డు త‌న రెడ్ చిల్లీస్ సంస్థానం స‌హా భారీ పారితోషికాలు, బ్రాండ్ అండార్స్ మెంట్ లు, ఇత‌ర వ్యాపార మార్గాల్లో ఏకంగా రూ. 7400 కోట్ల($876.5 మిలియన్లు)కు పైగా ఆర్జించాడు. షారూఖ్ బ్రాండ్ వ్యాల్యూ అంత‌కంత‌కు పెరుగుతోంద‌నేది తాజా స‌ర్వే.

ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నటుల జాబితాలో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ ($1.49 బిలియన్) (10వేల కోట్లు మించి), డ్వేన్ జాన్సన్ అలియాస్ ది రాక్ 10,000 కోట్లు ($1.19 బిలియన్) పైగా, టామ్ క్రూజ్ 7500 కోట్ల‌ ($891 మిలియన్) తర్వాతి స్థానంలో షారూఖ్‌ ఉన్నారు. ఇత‌ర ప్ర‌ముఖ న‌టుల్లో జార్జ్ క్లూనీ ($742.8 మిలియన్లు), రాబర్ట్ డి నీరో ($735.35 మిలియన్లు), బ్రాడ్ పిట్ ($594.23 మిలియన్లు), జాక్ నికల్సన్ ($590 మిలియన్లు), టామ్ హాంక్స్ ($571.94 మిలియన్లు), జాకీ చాన్ ($557.09 మిలియన్లు) లిస్ట్ లో టాప్ 10లో నిలిచారు.

బ్రాడ్ ఫిట్, టామ్ హాంక్స్, జార్జ్ క్లూనీ లాంటి టాప్ హీరోల్ని షారూఖ్ రేసులో వెన‌క్కి నెట్ట‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. దాదాపు మూడున్న‌ర ద‌శాబ్ధాల హిస్ట‌రీలో కింగ్ ఖాన్ షారూఖ్ ఎంతో ఎత్తుకు ఎదిగారు. అత‌డు ఖాన్‌ల త్ర‌యంలో వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతూ త‌న స్థాయిని కాపాడుకుంటున్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లోను తెలివైన పెట్టుబ‌డుల‌తోను అత‌డు గొప్ప ఎంట‌ర్ ప్రెన్యూర్ గా ఎదిగాడు.