Begin typing your search above and press return to search.

షారుక్ ఖాన్‌ ప్రాజెక్ట్.. మైత్రి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారా?

గత కొంతకాలంగా ఈ కాంబినేషన్‌పై రూమర్లు వినిపిస్తున్నప్పటికీ.. తాజాగా మేకర్స్ మరింత అడ్వాన్స్ స్టెప్ వేశారని టాక్.

By:  Tupaki Desk   |   22 Jun 2025 8:45 AM IST
షారుక్ ఖాన్‌ ప్రాజెక్ట్.. మైత్రి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారా?
X

తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్లను అందించిన టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్.. ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తుండటం సినిమావర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ఈ కాంబినేషన్‌పై రూమర్లు వినిపిస్తున్నప్పటికీ.. తాజాగా మేకర్స్ మరింత అడ్వాన్స్ స్టెప్ వేశారని టాక్.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు.. మైత్రి టీమ్ ఇటీవల ముంబయికి వెళ్లి షారుక్‌ను కలిసి ప్రాజెక్ట్ పై డిస్కషన్ చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఈ సినిమాను ఖాయం చేయడం కోసం ఆయనకు భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా చెల్లించారట. ఇప్పటికిప్పుడు షారుక్ ఫుల్ బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ.. ఈ సినిమా 2027లో సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఇక షారుఖ్ ఖాన్ ఒక్కో సినిమాకు 100 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలోనే అందుకుంటూ ఉంటాడు.

ఇక ప్రాఫిట్స్ లో షేరింగ్ పద్దతి కూడా ఉంటుంది. ఆయితే మైత్రి వాళ్ళతో ఆయన డీలింగ్స్ రెమ్యునరేషన్ పద్ధతి లోనే ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనప్పటికీ.. మైత్రి-షారుక్ కాంబినేషన్ వార్త ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే పుష్ప, వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ బ్యానర్.. ఇప్పుడు నార్త్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ షారుక్‌తో భారీ సినిమా చేయాలనే ప్లాన్‌తో ఉన్నట్లు సమాచారం.

ఇక ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయబోయే వ్యక్తిగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ పేరు ప్రచారంలో ఉంది. అయితే ప్రస్తుతం ఆయన రామ్ చరణ్‌తో “RC17” స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో.. షారుక్ ప్రాజెక్ట్ కోసం 2-3 సంవత్సరాల గ్యాప్ పడే అవకాశం కనిపిస్తోంది. అటు షారుక్ ఖాన్ కూడా తన తాజా చిత్రం “కింగ్” పనుల్లో నిమగ్నంగా ఉన్నాడు. ఇక దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ కచ్చితంగా ఒక బడా దర్శకుడిని రంగంలోకి దింపే అవకాశం అయితే ఉంది.

ఈ లైన్ అప్ దృష్ట్యా చూస్తే.. షారుక్ మైత్రి మూవీ మేకర్స్ సినిమా 2027లో మొదలయ్యే అవకాశం ఉండగా, ఈ ప్రాజెక్ట్ ను బాలీవుడ్ టాలీవుడ్ మధ్య సెట్ అయ్యే బిగ్ క్రాస్ ఓవర్‌లలో ఒకటిగా మారే అవకాశముంది. ఇటు సౌత్ మార్కెట్‌లోనూ, అటు నార్త్ ఇండియాలోనూ భారీ అంచనాల్ని ఏర్పరచే ఈ కాంబోపై త్వరలోనే క్లారిటీ రానుంది.