ఆ బాలీవుడ్ స్టార్ తో మైత్రీ సినిమా?
మొన్నామధ్య వైట్ షార్ట్ లో ఒంటి నిండా టాటూలతో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించాడు షారుఖ్ ఖాన్.
By: Tupaki Desk | 4 Jun 2025 6:48 PM ISTమొన్నామధ్య వైట్ షార్ట్ లో ఒంటి నిండా టాటూలతో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించాడు షారుఖ్ ఖాన్. అయితే షారుఖ్ అలా కనిపించింది తన తర్వాతి సినిమా కింగ్ కోసమని అందరూ భావించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో రానుండగా, కింగ్ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారమవుతుంది. షారుఖ్ ఖాన్, సౌత్ ఇండియన్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు షారుఖ్ కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేశారని కూడా ప్రచారం జరుగుతుంది.
ఇదే నిజమైతే ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా షారుఖ్ రికార్డుకెక్కుతాడు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలేమీ బయటకు రాకపోయినప్పటికీ ఇది కమర్షియల్ బ్యారియర్లను అధిగమించడానికి చేయబోతున్న పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ కావొచ్చని అంటున్నారు
అటు షారుఖ్ ఖాన్ కానీ, ఇటు నిర్మాణ సంస్థ కానీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించే వరకు దీన్ని కేవలం పుకారు అనే అనుకోవాలి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు. గతంలో కెజిఎఫ్, కాంతార లాంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ హృతిక్ రోషన్ తో డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ కూడా షారుఖ్ తో అలాంటి ఒప్పందాన్నే కుదుర్చుకుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. పుష్ప ఫ్రాంచైజ్ సినిమాలతో తమ నిర్మాణ సంస్థ క్రేజ్ ను దేశవ్యాప్తంగా పెంచుకున్న మైత్రీ మూవీ మేకర్స్ దాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ అడుగేసినట్టు చెప్తున్నారు. కేవలం రూమర్ తోనే ఈ కాంబినేషన్ సంచలనాన్ని సృష్టిస్తుంటే ఇక ఇది నిజమైతే ఎలాంటి రికార్డులు బ్రేక్ అవుతాయో ఊహించడమే కష్టం.
