ఎక్కడి నుంచి వచ్చామనేది ముఖ్యం కాదు: కింగ్ ఖాన్
కింగ్ ఖాన్ షారూఖ్ బాలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదిగేందుకు చాలా శ్రమించాడు. తాను ఔట్ సైడర్‌ని అనే కలత అతడికి ఎప్పుడూ లేదు.
By: Tupaki Desk | 3 May 2025 12:15 AM ISTసినీపరిశ్రమల్లో ఇన్ సైడర్- ఔట్ సైడర్ డిబేట్ ఎండ్ లెస్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నటవారసులు తెరకు పరిచయమైన ప్రతిసారీ ఇలాంటి ఒక చర్చ పుట్టుకొస్తూనే ఉంది. కానీ దీనిని వ్యతిరేకించే స్వరాలు లేకపోలేదు. తాజాగా WAVES 2023 సమ్మిట్‌లో కింగ్ ఖాన్ షారూఖ్ కూడా ఈ అంశాన్ని టచ్ చేసారు.
తాను పరిశ్రమ వెలుపలి నుంచి వచ్చానని ఆయన అన్నారు. ఖాన్ మాట్లాడుతూ.. ''నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఆకలి, ఆశయం, కృషి వంటి పదాలు రెగ్యులర్ గా రొమాంటిసైజ్ అవుతాయి. మీరు ఎక్కడి నుండి వచ్చారన్నది ముఖ్యం కాదు. మీరు ప్రవేశించాలనుకుంటున్న ప్రపంచంలో మీ స్థానాన్ని ఎలా నిలుపుకుంటారు అనేది ముఖ్యం. అది వ్యాపారం, రాజకీయాలు లేదా నటన ఏదైనా కావచ్చు'' అని అన్నారు. నేను సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు.. ఇది నా ప్రపంచం అని నేను నమ్మాను.. పరిశ్రమ నన్ను ముక్తకంఠంతో స్వీకరించిందని షారూఖ్ అన్నారు.
కింగ్ ఖాన్ షారూఖ్ బాలీవుడ్‌లో కథానాయకుడిగా ఎదిగేందుకు చాలా శ్రమించాడు. తాను ఔట్ సైడర్‌ని అనే కలత అతడికి ఎప్పుడూ లేదు. చేసే పనిపై శ్రద్ద, అంకితభావం, మనో ధైర్యంతో అతడు ఇంతింతై అన్న చందంగా ఎదిగాడు. నేడు దేశంలోని పాన్ ఇండియన్ స్టార్ లలో ఒకరిగా, భారతదేశంలోనే గాక ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న నటుడిగాను రికార్డులకెక్కాడు. షారూఖ్ 7400 కోట్ల నికర ఆస్తులతో ఎవరూ అందుకోలేని స్థాయికి ఎదిగాడు. అయితే కార్తీక్ ఆర్యన్, ఆయుష్మాన్ ఖురానా, కంగన రనౌత్ లాంటి తారలు ఔట్ సైడర్ నటులను పరిశ్రమ దరి చేరనీయదని ఆరోపించిన సందర్భాలున్నాయి. కానీ వారంతా ప్రతిభతో ఈ రంగంలో ఎదిగారు.
