స్టార్ హీరోని తుపాకీతో బెదిరించిన బామ్మర్ధి!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ - గౌరీ ఖాన్ జంట ప్రేమ వివాహం గురించి అభిమానులకు బాగా తెలుసు.
By: Tupaki Desk | 28 May 2025 9:39 AM ISTబాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ - గౌరీ ఖాన్ జంట ప్రేమ వివాహం గురించి అభిమానులకు బాగా తెలుసు. ఈ జోడీ స్కూల్ లో చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. అప్పటికి గౌరీ వయసు తొమ్మిది కాగా, షారూఖ్ వయసు పన్నెండు. ఇంత చిన్న వయసులో ప్రేమ లో పడిన హీరోగాను షారూఖ్ రికార్డులు తిరగరాసాడు. అయితే హిందూ కుటుంబంలో జన్మించిన గౌరీతో మతాంతర వివాహాన్ని సక్సెస్ చేసిన ఖాన్ పట్టుదల ఎంతో గొప్పది.
షారూఖ్‌ని పెళ్లాడేందుకు అభినవ్ అని పేరు మార్చింది గౌరీ. అలా చేస్తే ఇంట్లో వాళ్లు హిందువు అనుకుంటారని భావించిందట. కానీ ఆ ప్లాన్ చివరికి బెడిసి కొట్టింది. ఒక ముస్లిమ్ యువకుడైన షారూఖ్ సినీనటుడు అవుతాడని తెలిస్తే అసలు ఇంట్లో వాళ్లు పిల్లను ఇచ్చేందుకు అవకాశమే లేదు. దీంతో గౌరీ అతడితో చాలా వేషాలు వేయించింది. కానీ తమ పిల్లతనం, పోకిరీ వేషాలు తర్వాత బయటపడిపోయాయని, ఇంట్లో దొరికిపోయామని కూడా గౌరీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అదంతా ఒకెత్తు అయితే, షారూఖ్ తన సోదరితో ప్రేమాయణం సాగించడం గౌరీ సోదరుడు అయిన విక్రాంత్ చిబ్బర్ కి అస్సలు నచ్చేది కాదట. అతడు తన చేతిలో గన్ తో షారూఖ్ ని బెదిరించేవాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కింగ్ ఖాన్ షారూఖ్ స్వయంగా చెప్పారు. తన సోదరికి అతడు హాని చేస్తాడని చిబ్బర్ చాలా కలతకు గురయ్యేవాడు. దాంతో ఎప్పుడూ ఖాన్ ని బెదిరించేవాడట. అయితే ఎన్ని వార్నింగులు ఇచ్చినా కానీ, చివరికి గౌరీఖాన్ ఇంట్లో పెద్దల్ని ఒప్పించి షారూఖ్ పెళ్లాడాడు. తన ప్రేమలో విజయం సాధించాడు. షారూఖ్- గౌరీ జంట ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆదర్శ జంట. ఖాన్ బాలీవుడ్ అగ్ర హీరోగా ఎదగక ముందు ఒక సాధారణ యువకుడు మాత్రమే. గౌరీఖాన్ కుటుంబం అప్పటికే బాగా స్థిరపడిన కుటుంబం. ధనవంతుల కుటుంబం నుంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు షారూఖ్.
