హిందీ సినిమా వినాశనం వెనక అసలు కారణం?
ఇటీవల బాలీవుడ్ వినాశనం గురించి చాలా చర్చ సాగుతోంది. సరైన కథలు లేక, రీమేక్ లపై ఆధారపడుతున్న బాలీవుడ్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? అనే దానిని సీనియర్ నటి షబానా ఆజ్మీ స్పష్ఠంగా చర్చించారు.
By: Tupaki Desk | 31 March 2025 8:00 PM ISTఇటీవల బాలీవుడ్ వినాశనం గురించి చాలా చర్చ సాగుతోంది. సరైన కథలు లేక, రీమేక్ లపై ఆధారపడుతున్న బాలీవుడ్ ప్రస్తుతం ఏ దశలో ఉంది? అనే దానిని సీనియర్ నటి షబానా ఆజ్మీ స్పష్ఠంగా చర్చించారు. బాలీవుడ్ లో సరైన కథలు లేవని వెటరన్ నటి అంగీకరించారు. ``స్తంభాలు సరైన స్థలంలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోకుండా మీ ఇంటి లోపలి అలంకరణను ప్రారంభించడం కరెక్టేనా? నిర్మాణం సరిగ్గా లేకపోతే అలంకరణతో మీరు ఏమి చేస్తారు?`` అని షబానా ప్రశ్నించారు.
అయితే ఇటీవల జామిని ఛటర్జీ (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ), షీలా (డబ్బా కార్టెల్) వంటి ప్రభావవంతమైన పాత్రలను పోషించిన షబానా, సీనియర్ లు పెళ్లయిన నటీమణులకు గతంలో కంటే మెరుగైన పాత్రలు అందిస్తున్నారని అన్నారు.
74 ఏళ్ల నటి షబానా అజ్మీ చాలా మంది ఇండస్ట్రీ అనుభవజ్ఞుల మాదిరిగానే హిందీ సినిమా `పరివర్తన దశ`లోకి వెళుతోందని అన్నారు. ఓటీటీలు చిత్రనిర్మాతలకు సహాయం చేశాయని అంగీకరించినా కానీ.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఆగమనం వల్ల ప్రతికూలతను గుర్తించానని కూడా తెలిపారు. నేటి చిత్రాలలో ప్రభావవంతమైన కంటెంట్ లేకపోవడంతో ఓటీటీలపై ఆధారపడుతున్నారని కూడా అన్నారు. రెగ్యులర్‌గా తన భర్త, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్‌తో దీనిపై చర్చిస్తానని తెలిపారు. హిందీ సినిమాలో మారుతున్న కథల గురించి ప్రస్థావిస్తూనే.. మంచి కథలు లేకపోవడాన్ని అంగీకరిస్తున్నామని షబానా అన్నారు. కొన్ని సినిమాలు ఓటీటీలో వచ్చాక చూద్దామనే ఆలోచన ప్రజలకు ఉందని కూడా షబానా వ్యాఖ్యానించారు.
సినిమాలో పాటలు, డైలాగులు బాగున్నంత మాత్రాన కథ లేకపోతే అది పునాది లేని భవంతి లాంటిదని అన్నారు.
ప్రతిదీ వేగంతో కదులుతుంది. మీరు ఒక క్షణం ఏదైనా ఆనందిస్తారు.. కానీ ఆలోచనకు ఆహారం ఉండాలి! అని షబానా అభిప్రాయపడ్డారు. కంటెంటే కింగ్.. కథ చెప్పడంలో ఎక్కువ ఆలోచన అవసరం అని ఆమె అన్నారు. కథ చెప్పే విధానం మార్చాలనుకున్నా కానీ సరైన కథను మాత్రం ఎంపిక చేయాలని కూడా విశ్లేషించారు.
