మత్తు కళ్లతో చిత్తు చేసిన షామా
షామా తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోషూట్‌లో వైట్ బాడీ కాన్ డ్రెస్‌లో మతులు చెడగొట్టింది.
By: Tupaki Desk | 6 April 2025 9:13 AM ISTతనదైన అందం ఆకర్షణతో షామా శికందర్ యువతరంలో భారీ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. బుల్లితెర నటిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫ్యాన్స్ తనను వోన్ చేసుకున్నారు. తనకు ఉన్న ఫాలోయింగ్‌కి తగ్గట్టే ఇన్ స్టా వేదికపై నిరంతర ట్రీట్ కి ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ.
షామా తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోషూట్‌లో వైట్ బాడీ కాన్ డ్రెస్‌లో మతులు చెడగొట్టింది. శరీరాన్ని అందంగా అల్లుకుపోయన ఈ గౌన్ .. షామా ఎక్స్ ప్రెషన్స్ గురించి బోయ్స్ విస్త్రతంగా చర్చిస్తున్నారు. ఈ అందమైన ఫోటోగ్రాప్ కి అద్భుతమైన క్యాప్షన్ ని షామా ఇచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్ నలుపు, తెలుపు కావచ్చు, కానీ నన్ను నమ్మండి, ఆ క్షణం రంగులతో నిండి ఉంది... అని ఫోటోకి క్యాప్షన్ రాసింది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
షామా కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కేవలం 17 సంవత్సరాల వయసులో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ. తనదైన అందం నటప్రతిభతో పెద్ద నిర్మాతలు దర్శకుల దృష్టిని ఆకర్షించింది. 1999లో ఆమిర్ ఖాన్- మనీషా కొయిరాలాతో కలిసి మన్ చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఇంద్రకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది షామాకు ఒక గొప్ప అరుదైన క్షణం. ఆ తర్వాత వరసగా క్రేజీ ప్రాజెక్టులు లభించాయి. తరువాత యే మొహబ్బత్ హై, అన్ష్: ది డెడ్లీ పార్ట్, బస్తీ, ధూమ్ దడక్కా, కాంట్రాక్ట్, బైపాస్ రోడ్ సహా మరెన్నో హిట్ చిత్రాలలో నటించింది. నేడు సోషల్ మీడియాల్లో భారీ క్రేజ్ ఉన్న బ్యూటీగా వెలిగిపోతోంది. విదేశీ ప్రియుడు జేమ్స్ మిల్లిరాన్ తో ఈ భామ జీవితం హాయిగా, లగ్జరియస్ గా సాగిపోతోంది.
