Begin typing your search above and press return to search.

ఆగష్టు 15.. ఏడు సినిమాల బాక్సాఫీస్ ఫైట్..?

సినిమాల రిలీజ్ డేట్ పై స్టార్స్ మధ్య పోటీ అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సంక్రాంతి సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 10:15 AM GMT
ఆగష్టు 15.. ఏడు సినిమాల బాక్సాఫీస్ ఫైట్..?
X

సినిమాల రిలీజ్ డేట్ పై స్టార్స్ మధ్య పోటీ అందరికీ తెలిసిందే. రీసెంట్ గా సంక్రాంతి సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. సంక్రాంతి తర్వాత సమ్మర్ లో కూడా అదే ఫైట్ జరుగుతుంది. ఏప్రి, మే నెలల్లో ఈ ఫైట్ షురూ అవుతుంది. అయితే సమ్మర్ తర్వాత సినిమా రిలీజ్ లకు ఒకే ఒక్క ఐకానిక్ డేట్ ఆగష్టు 15.. ఇండిపెండెన్స్ డే నాడు అందరికీ హాలీడే అవ్వడం వల్ల ఆరోజున సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా రిలీజ్ కు అదొక మంచి రోజుగా పరిగణిస్తారు.

ఎప్పటిలానే ఈసారి ఆగష్టు 15కి సినిమాల మధ్య గట్టి ఫైట్ జరిగేలా ఉంది. ఆగష్టు 15న పుష్ప 2 ది రూల్ ఆల్రెడీ రిలీజ్ లాక్ చేశాడు. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 మీద నేషనల్ లెవెల్ లో భారీ హైప్ ఉంది. సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా పుష్ప 1 మాత్రమే కాదు పుష్ప 2 కూడా తగ్గేదేలే అనిపిస్తుందని సుకుమార్ చెప్పకనే చెప్పాడు. ఈ సినిమా ఆగష్టు 15న కచ్చితంగా వస్తుందని అంటున్నారు. రిలీజ్ డేట్ పై ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దని చెబుతున్నారు.

ఇక పుష్ప 2 వస్తుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ కొనసాగుతుండగా ఆ డేట్ కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ దేవరని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ అనుకున్నారు. కానీ ఆ సినిమా ఆ డేట్ న రావడం కష్టమని తెలుస్తుంది. ఏప్రిల్ ఎలాగు మిస్ అవుతుంది కాబట్టి ఆగష్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట దేవర మేకర్స్.

ఆగష్టు 15న సరిపోదా శనివారం తో వస్తున్నాడు నాని. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పుష్ప 2 వచ్చినా కూడా నాని సరిపోదా శనివారం రంగంలోకి దిగేలా ఉంది.

వీటితో పాటుగా అజయ్ దేవగన్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో వస్తున్న సింగం ఎగైన్ కూడా ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. సింగం సీరీస్ లతో సూపర్ పాపులర్ అయిన రోహిత్ శెట్టి అజయ్ దేవగన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై కూడా బాలీవుడ్ లో భారీ హైప్ ఏర్పడింది.

ఆగష్టు 15న కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 ని కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట. సూపర్ హిట్ సినిమా ఇండియన్ కి సీక్వెల్ గా వస్తున్న ఇండియన్ 2 నుంచి ఈమధ్య వచ్చిన టీజర్ సూపర్ అనిపించగా పార్ట్ 2 పై అంచనాలు పెరిగాయి. ఇండియన్ 2 కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఆగష్టు 15న రేసులో ఉంటుందని టాక్.

సూర్య నటిస్తున్న కంగువ సినిమా కూడా ఆగష్టు ఫైట్ లో దించుతున్నారట. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. పీరియాడికల్ కథతో వస్తున్న ఈ సినిమాలో సూర్య లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ సినిమా కూడా ఇండిపెండన్స్ డే రిలీజ్ సినిమాల రేసులో నిలుస్తుందని టాక్.

ఇవే కాకుండా సూపర్ స్టార్ రజినికాంత్ టీ జే జ్ఞానవెల్ కాంబోలో వస్తున్న వెట్టయన్ కూడా ఆగష్టు 15న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఒక్క డేట్ న ఈ సినిమాల రిలీజ్ అనుకుంటున్నారు. అయితే వీటిలో పుష్ప 2 దాదాపు కన్ ఫర్మ్ అనిపిస్తుండగా దేవరతో పాటుగా మిగతా సినిమాలన్నీ అఫీషీల్ గా ప్రకటించాల్సి ఉంది. సరిపోదా శనివారం మాత్రం పుష్ప తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు.

అయితే పుష్ప 2 కూడా చివర్లో రిలీజ్ వాయిదా వేసుకుంటే ఈ సినిమాల్లో ఏదో ఒకటి రిలీజ్ షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఆగష్టు 15న రిలీజ్ అంటూ ఈ ఏడు సినిమాలు హడావిడి చేస్తున్నాయి. వీటిలో ఏ సినిమా వస్తుంది ఏది వెనక్కి తగ్గుతంది అన్నది ఆ టైం కు తెలుస్తుంది.