Begin typing your search above and press return to search.

పవన్ తో సెట్టవ్వక.. మరో దర్శకుడు కూడా..?

కానీ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

By:  Tupaki Desk   |   17 Dec 2023 6:52 PM GMT
పవన్ తో సెట్టవ్వక.. మరో దర్శకుడు కూడా..?
X

పవన్ కళ్యాణ్ కి కెరియర్ లోనే 'గబ్బర్ సింగ్' తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందించిన హరీష్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత పవన్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను ప్రకటించారు. కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. పవన్ ఫ్యాన్స్ లో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీలైనంత తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయాలనుకున్నాడు హరీష్ శంకర్. కానీ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం వల్ల షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

ఏపీ ఎలక్షన్స్ కూడా దగ్గర పడ్డాయి. దాంతో పవన్ తన ఫోకస్ అంతా రాజకీయాల పైన పెట్టాడు. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ ని కొద్ది నెలల పాటు హోల్డ్ లో పెట్టారు. దాంతో ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ రవితేజతో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ తో ఇప్పట్లో సెట్ అయ్యే అవకాశం లేకపోవడంతో వెంటనే రవితేజ సినిమాని స్టార్ట్ చేసేసాడు హరీష్ శంకర్. కేవలం వారం రోజుల్లోనే ఎలాంటి హడావుడి లేకుండా సినిమాని ప్రకటించడం, ఆ తర్వాత హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేయడం, వెంటనే టైటిల్ ప్రకటించి ఈరోజు పూజా కార్యక్రమాలను కూడా పూర్తయిపోయాయి.

చాలా ఏళ్ల తర్వాత హరీష్ శంకర్ - రవితేజ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. వీలైనంత తక్కువ సమయంలో ఈ సినిమాని కంప్లీట్ చేయాలని హరీష్ శంకర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈయనతో పాటూ హరిహర వీరమల్లు డైరెక్టర్ క్రిష్ కూడా అదే పనిలో ఉన్నాడట. ఆయన కూడా రేపో మాపో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ తో క్రిష్ తెరకెక్కిస్తున్న 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఆగిపోయి చాలా కాలమైంది. అందుకే క్రిష్ మరో కొత్త ప్రాజెక్టును మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడట. ఈ కొత్త ప్రాజెక్టు కోసం ఐదు నెలల సమయం తీసుకుని ఛాన్స్ ఉందని అంటున్నారు. అంటే హరిహర వీరమల్లు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చు.

ఇక హరీష్ శంకర్ రవితేజ 'మిస్టర్ బచ్చన్' విషయానికి వస్తే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.