Begin typing your search above and press return to search.

రామాయ‌ణం: సేతుప‌తి అందుకేనా స్కిప్?

నిజానికి ఇలాంటి సినిమాల‌కు కాస్టింగ్ సెల‌క్ష‌న్ అనేది పెను స‌వాల్ లాంటిది.

By:  Tupaki Desk   |   10 March 2024 7:27 PM GMT
రామాయ‌ణం: సేతుప‌తి అందుకేనా స్కిప్?
X

దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్ తో పురాణేతిహాసం 'రామాయణం'పై మూడు భాగాల సినిమాను తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. నితేష్ తివారీ ఈ సిరీస్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పౌరాణిక ఇతిహాస‌ డ్రామా రామాయ‌ణంలో ఒక‌దానిని మించి ఒక‌టిగా పాత్ర‌లు ఉంటాయి. చాలామంది పాత్ర‌ధారులు అవ‌స‌రం. నిజానికి ఇలాంటి సినిమాల‌కు కాస్టింగ్ సెల‌క్ష‌న్ అనేది పెను స‌వాల్ లాంటిది. ఏళ్ల‌త‌ర‌బ‌డి చిత్రీక‌ర‌ణ‌లోనే ఉండాల్సి ఉంటుంది గ‌నుక క‌మిటైతే ఆర్టిస్టు బుక్ అయిపోయిన‌ట్టే. రాజ‌మౌళి బాహుబ‌లి చిత్రం కోసం ఐదేళ్ల పాటు ప్ర‌భాస్, రానాను బ్లాక్ చేసిన‌ట్టే, రామాయ‌ణం లాంటి సినిమాల‌కు కూడా ఆర్టిస్టుల కాల్షీట్ల‌ను బ‌ల్క్ గా బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా స‌మస్య‌త్మ‌క‌మైన‌ది.

కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు విభూష‌ణుడి పాత్ర‌లో న‌టించేందుకు ఒప్పుకున్న విజ‌య్ సేతుప‌తి నేరుగా నితీష్ కి కాల్ చేసి ఈ సినిమాలో చేయ‌లేక‌పోతున్నందుకు క్ష‌మించాల‌ని కోరార‌ట‌. దీంతో ఇప్పుడు ఆ పాత్రలో ప్ర‌ముఖ‌ స్టార్ కిడ్ నటించే అవకాశం ఉందని తెలిసింది. రామాయణంలో విభీషణుడి పాత్రలో నటించే అవకాశం ఉన్న ఈ స్టార్ కిడ్ ఇటీవల వెబ్ సిరీస్‌లలో ఒకదానిలో పోలీసుగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడు మరెవరో కాదు హర్మన్ బవేజా.

రామాయణంలో రావణుడి తమ్ముడు విభీషణ్‌గా హర్మాన్ బవేజా నటించే అవకాశం ఉంది. అయితే ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. హర్మాన్ 2023లో హన్సల్ మెహతా స్కూప్ షోతో అద్భుతమైన పునరాగమనాన్ని చాటుకున్నాడు. ఇందులో అతను JCP హర్షవర్ధన్ ష్రాఫ్ పాత్రను పోషించాడు. ఇది పోలీసు అధికారి హిమాన్షు రాయ్ జీవితం ఆధారంగా రూపొందించిన‌ది. మ‌రోవైపు విభీష‌ణ్ పాత్ర‌కు ఎంపికైన హర్మాన్ బవేజా త‌దుప‌రి హన్సల్ మెహతా `కెప్టెన్ ఇండియా`లో న‌టిస్తున్నారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ కూడా నటించాడు.

నితేష్ తివారీ `రామాయణం` శ్రీరాముని జీవితం.. ధర్మంపై అచంచలమైన నిబద్ధతను లోతుగా పరిశోధించే ట్ర‌యాల‌జీ. ఈ చిత్రంలో రాముడి పాత్రకు రణబీర్ కపూర్, సీత పాత్ర కోసం సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. రావణుడి పాత్ర కోసం యష్ ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

విజ‌య్ సేతుప‌తి భార‌త‌దేశంలోనే అత్యంత బిజీ న‌టుడు. ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను పైగానే క్రేజీ సినిమాల‌తో బిజీ. డ‌జ‌న్ల కొద్దీ క‌థ‌లు, స్క్రిప్టులు అత‌డి క్యూలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు రామాయ‌ణం లాంటి భారీ చిత్రానికి క‌మిటైతే, ఇత‌ర ప్రాజెక్టుల‌ను వ‌దులుకోవాల్సి ఉంటుంద‌ని భావించి, ముందుగానే నితీష్ కి చేయ‌లేన‌ని చెప్పేసాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది.