Begin typing your search above and press return to search.

విజయ్ సేతుపతి 'ఏస్' మూవీ.. తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 May 2025 5:52 PM IST
విజయ్ సేతుపతి ఏస్ మూవీ.. తెలుగు ట్రైలర్ ఎలా ఉందంటే?
X

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన సినిమాలు టాలీవుడ్ లో విడుదలై అలరిస్తుంటాయి. ఇప్పుడు ఏస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించగా.. దర్శకుడిగా, నిర్మాతగా అరుముగ కుమార్ వ్యవహరించారు.

7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆయన నిర్మించిన మూవీ.. మే 23వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగులో కూడా విడుదలవుతుంది. ఈ క్రమంలో తెలుగు హక్కులను శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించుకుంది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లుంగీ, షర్ట్ తో ఫ్లైట్ దిగిన విజయ్ సేతుపతి.. తన పేరు బోల్ట్ కాశీ అంటూ పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత యోగి బాబు కామెడీ చేయగా.. నా కళ్ళముందు అన్యాయం జరిగితే బోల్ట్ గా ఎదిరిస్తా అని చెబుతారు విజయ్. అలా హీరోహీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ ను చూపించారు మేకర్స్.

ట్రైలర్ లోని మలేషియాలో జరిగే ఇల్లీగల్ కార్యకలాపాలు, చేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అదిరిపోయాయనే చెప్పాలి. జూదం అనేది ఉప్పెనలాంటిది.. క్లైమాక్స్ గుర్తుంది కదా అంటూ యోగి బాబు చెప్పే కామెడీ డైలాగ్ బాగుంది. ముఖ్యంగా హీరో వేసే ప్లాన్ ఏంటి? అసలు దేని కోసం పోరాటం చేస్తున్నారు? అంటూ ట్రైలర్ తో ఆసక్తి రేపారు మేకర్స్.

ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ సేతుపతి మరోసారి తన యాక్షన్ తో మెప్పించేలా కనిపిస్తున్నారు. హీరోయిన్ రుక్మిణీ వసంత్ తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ట్రైలర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి. కరణ్ బి. రావత్ కెమెరా వర్క్ రిచ్‌ గా కనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ అంచనాలు పెంచుతోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. విజయ్ సేతుపతి, యోగి బాబు, రుక్మిణీ వసంత్ తో పాటు దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్, బి.ఎస్. అవినాష్, ముత్తు కుమార్, రాజ్ కుమార్, డెనెస్ కుమార్, ఆల్విన్ మార్టిన్, ప్రిసిల్లా నాయర్, జాస్పర్ సుపయా, కార్తీక్ జే, నాగులన్, జహ్రినారిస్ తదితరులు నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.