Begin typing your search above and press return to search.

'నెరు' ట్రైల‌ర్: సీరియ‌స్ లా పాయింట్ ట‌చ్ చేసారు

ఇందులో మోహన్‌లాల్ లాయర్‌గా నటిస్తుండగా, ప్రియమణి కూడా లాయ‌ర్ పాత్ర‌లో కనిపించింది.

By:  Tupaki Desk   |   9 Dec 2023 3:54 PM GMT
నెరు ట్రైల‌ర్: సీరియ‌స్ లా పాయింట్ ట‌చ్ చేసారు
X

మ‌ల‌యాళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఇది. జీతూ జోసెఫ్‌, మోహన్‌లాల్ కాంబినేష‌న్ మూవీ `నెరు` ట్రైలర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం మోహన్‌లాల్ లాయర్‌గా నటించిన తీరుకు ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఏదో ఒక స‌స్పెన్స్ ని లీడ్ చేస్తూ అత‌డి న్యాయ‌వృత్తిలోని కాఠిన్యాన్ని ఈ ట్రైల‌ర్ ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇందులో మోహన్‌లాల్ లాయర్‌గా నటిస్తుండగా, ప్రియమణి కూడా లాయ‌ర్ పాత్ర‌లో కనిపించింది. నెరు క్రిస్మస్ కానుక‌గా డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది.

తాజాగా రిలీజైన ట్రైల‌ర్ ని బ‌ట్టి ఇందులో ఒక సీరియ‌స్ లా పాయింట్ ని ట‌చ్ చేసారని అర్థ‌మ‌వుతోంది. కోర్ట్ రూమ్ డ్రామా ట్విస్టులు ట‌ర్నుల‌తో రంజింప‌జేస్తుంద‌ని కూడా క్లూ ఉంది. ఈ చిత్రం న్యాయస్థానం, వ్యాజ్యం, న్యాయ పోరాటాన్ని చాలా వాస్తవికంగా ప్రదర్శించే లీగల్ థ్రిల్లర్ డ్రామా అని అర్థ‌మ‌వుతోంది. పాత్ర‌ల తీరుతెన్నుల‌ను బ‌ట్టి బలమైన కుటుంబ సంబంధాలు ఆక‌ట్టుకోనున్నాయి. సిద్దిక్, నందు, దినేష్ ప్రభాకర్, శంకర్ ఇందుచూడన్, మాథ్యూ వర్గీస్, కాలేష్, రమాదేవి, కళాభవన్ గింటో, రష్మీ అనిల్, డా.ప్రశాంత్ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి శాంతి మాయాదేవి - జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే రాశారు. వినాయక్ శశికుమార్ సాహిత్యం అందించ‌గా, విష్ణు శ్యామ్ స్వరాలు సమకుర్చారు. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఎలోన్ తర్వాత థియేటర్లలోకి రాబోతున్న మోహన్ లాల్ సినిమా ఇది. జీతూ జోసెఫ్‌తో మోహన్‌లాల్‌కి ఇది నాలుగో సినిమా. దృశ్యం సినిమాతో పాటు గత మూడు చిత్రాలతో ఘనవిజయం సాధించిన లాల్ `నెరు` చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అధిపన్‌, హరికృష్ణన్‌ చిత్రాల తర్వాత మోహన్‌లాల్‌ లాయర్‌గా నటిస్తున్న చిత్రం కావ‌డంతో ఆస‌క్తి నెల‌కొంది. లాయ‌ర్లు కోర్టు రూమ్ డ్రామా అంటే స‌హ‌జంగానే ఆస‌క్తి క‌లుగుతుంది. జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే ప‌నిత‌నం మ‌రోసారి నిరూప‌ణ కానుంది.