Begin typing your search above and press return to search.

బికినీలో సీరియల్ నటి.. మళ్ళీ షాక్ ఇచ్చిందిగా..

షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటోంది ఈ అమ్మడు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 7:13 PM IST
బికినీలో సీరియల్ నటి.. మళ్ళీ షాక్ ఇచ్చిందిగా..
X

గుప్పెడంత మనసు సీరియల్ లో కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ పద్దతిగా మెరిసి ఎంత క్రేజ్ తెచ్చుకుందో తెలిసిందే. ఈ డైలీ సీరియల్ లో జగతి పాత్రలో అద్భుతంగా నటిస్తూ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఇప్పుడు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.


షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటోంది ఈ అమ్మడు. తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను పంచుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. ఫ్యాన్స్ కు ఫుల్ మజా అందిస్తుంటుంది.

తాజాగా మరోసారి ఈ బ్యూటీ బికినీలో దర్శనమిచ్చింది. పల్చటి బ్లాక్ షార్ట్ డ్రెస్ కమ్ బికినీలో స్టన్నింగ్ పోజు ఇచ్చిన ఫొటోను షేర్ చేసింది. వెబ్ సిరీస్ సెట్స్ లో దిగిన ఫొటో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆమె లుక్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. లైకులు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. హీరోయిన్ పీస్ అంటూ జ్యోతి రాయ్ పిక్ ను రీ షేర్ చేస్తున్నారు.

జ్యోతి రాయ్ మోడల్‌ గా కెరీర్‌ ను ప్రారంభించింది. ఆ తర్వాత బందె బరాటవ కాలా సీరియల్ ద్వారా నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది. ఈ తర్వాత అదే భాషలో చాలా సీరియళ్లను చేసింది. ఆ తర్వాత తమిళం, తుళు భాషల్లో కూడా చాలా ధారావాహికల్లో నటించి ఫుల్ ఫేమస్ అయిపోయింది.

ప్రస్తుతం జ్యోతి రాయ్.. నో మోర్ సీక్రెట్స్ అనే వెబ్ సిరీస్‌ లో నటిస్తోంది. విజయ్ కుడికుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్‌ లో కృనాల్ కపూర్ కు జోడీగా యాక్ట్ చేస్తోంది. ఇటీవలే ఈ సిరీస్ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ మారింది. అందులో బీచ్ లో కుర్రాడితో లిప్ లాక్ చేస్తూ ఆమె కనిపించింది.

38 ఏళ్ల ఈ బ్యూటీకి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వారికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ మధ్యే ఆమె యువ దర్శకుడు సుకు పుర్వాజ్ తో ప్రేమలో పడింది. అతడిని పెళ్లి కూడా చేసుకున్నట్లు చెబుతున్నా అధికారికంగా ప్రకటించలేదు.